AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN-Aadhaar Link: మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయలేదా..? రెట్టింపు పెనాల్టీ చెల్లించాల్సిందే..!

PAN-Aadhaar Link: దేశంలో ముఖ్యమైన పత్రాల్లో ఒకటైన ఆధార్‌. ఇక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించి, అలాగే బ్యాంకు లావాదేవీల్లో ముఖ్యమైన పత్రాల్లో పాన్‌ కార్డు. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు విషయంలో..

PAN-Aadhaar Link: మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయలేదా..? రెట్టింపు పెనాల్టీ చెల్లించాల్సిందే..!
Pan Aadhaar Linking
Subhash Goud
|

Updated on: Jul 16, 2022 | 9:56 AM

Share

PAN-Aadhaar Link: దేశంలో ముఖ్యమైన పత్రాల్లో ఒకటైన ఆధార్‌. ఇక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించి, అలాగే బ్యాంకు లావాదేవీల్లో ముఖ్యమైన పత్రాల్లో పాన్‌ కార్డు. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు విషయంలో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని కేంద్రం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా విధిస్తూ పొడిగిస్తూ వస్తు్న్నారు. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకు ఖాతా స్థంభించిపోతుంది. దీంతో లావాదేవీలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాదు పాన్‌ కార్డు యాక్టివ్‌గా ఉండాలంటే ముందుగా ఆధార్‌తో లింక్‌ చేసి ఉండాలి. పాన్‌ అనుసంధానం ఈ గడువు మార్చి 31, 2023 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ గడువు పెంచినా.. ఏప్రిల్ 1, 2022 నుండి మీరు మీ పాన్‌ని ఆధార్‌తో లింక్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్చి 29, 2022 నాటి నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022 నుండి మార్చి 31, 2023 వరకు పొడిగించబడింది.

రూ.500 పెనాల్టీ..

మీరు జూన్‌ 30, 2022 లేదా, అంతకంటే ముందు మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేసినట్లయితే మీరు రూ.500 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో జూలై 1, 2022న లేదా ఆ తర్వాత లింక్‌ చేసినట్లయితే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా గడువులోగా అనుసంధానం చేయకపోయినా కార్డు యాక్టివ్‌గానే ఉంటుంది. కాకపోతే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పెనాల్టీ ఎలా చెల్లించాలి?

☛ ముందుగా ఆధార్-పాన్ లింక్ కోసం అభ్యర్థనను సమర్పించడానికి (NSDL) పోర్టల్ ని సందర్శించండి.

☛ అభ్యర్థనను సమర్పించడానికి CHALLAN NO./ITNS 280 క్రింద ఉన్న ప్రొసీడ్ ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వర్తించే పన్నును ఎంచుకోండి.

☛ ఫీజు చెల్లింపు మైనర్ హెడ్ 500 (ఫీజు) మరియు మేజర్ హెడ్ 0021 కింద ఒకే చలాన్‌లో చేయబడిందని నిర్ధారించుకోండి.

☛ తర్వాత, మీ నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి.

☛ అప్పుడు, పాన్ నంబర్‌ను నమోదు చేయండి. అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకుని, మీ ఇంటి చిరునామాను నమోదు చేయండి.

☛ చివరగా, స్క్రీన్‌పై చూపబడిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ప్రొసీడ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

ఆధార్-పాన్‌ లింక్‌ చేయడం ఎలా..?

☛ ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ కి వెళ్లండి.

☛ ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత ఆధార్‌ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.

☛ ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

☛ మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి.

☛ దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన తర్వాత ధృవీకరించుపై క్లిక్ చేయండి. ఇలా ఆలస్య రుసుము చెల్లించి ఈ ప్రాసెస్‌ తర్వాత మీ ఆధార్-పాన్ లింక్ చేయబడతాయి.