NPS Account: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. మొబైల్‌ నుంచే నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ అకౌంట్‌

NPS Account: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. వినియోగదారులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి ఇతర రంగాలలో అనేక ప్రయోజనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి..

NPS Account: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. మొబైల్‌ నుంచే నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ అకౌంట్‌
NPS Account
Follow us
Subhash Goud

|

Updated on: Jul 16, 2022 | 11:31 AM

NPS Account: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. వినియోగదారులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి ఇతర రంగాలలో అనేక ప్రయోజనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంతో ఇంట్లోనే ఉండి మొబైల్‌లో సులభంగా సేవలను పొందే విధంగా సదుపాయాలు అందుబాటులోకి వస్తు్న్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాపెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA తో కలిసి శుక్రవారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు మొబైల్‌ను ఉపయోగించి నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) ఖాతాలను తెరవడానికి అనుమతి ఇస్తుంది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PERDA), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఎన్‌పీఎస్‌ నమోదు కోసం డిజిటల్‌ ప్లాట్‌ ఫారమ్‌ను ప్రారంభించాయి.

QR కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా కస్టమర్లు ఇప్పుడు ఎటువంటి అవాంతరాలు లేని, పేపర్‌లెస్‌ పద్దతిలో ఎన్‌పీఎస్‌ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాయి. అయితే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా ఎన్‌పీఎస్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి వెబ్‌పేజీలోకి వెళ్లవచ్చు. అలాగే ఫోటో, ఇతర వివరాలను డిజిలాకర్‌ నుంచి పొందడం కోసం ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేసే ప్రక్రియ సులభంగానూ, వేగవంతంగానూ, కాగితరహితమైనదని తెలిపింది. ఎన్‌పీఎస్‌ స్కీమ్‌ కింద చందాదారులకు వారి భవిష్యత్తును మెరుగు పర్చడానికి, సురక్షితంగా ఉంచడానికి అనేక ప్రయోజనాలను అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి