SBI: ఎస్‌బీఐ కొత్త సదుపాయం.. ఇంట్లోనే ఉండి రూ.35 లక్షల ప్రయోజనం.. పూర్తి వివరాలు

SBI Real Time Xpress Credit: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల సౌలభ్యం కోసం గొప్ప సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని..

SBI: ఎస్‌బీఐ కొత్త సదుపాయం.. ఇంట్లోనే ఉండి రూ.35 లక్షల ప్రయోజనం.. పూర్తి వివరాలు
Sbi Real Time Xpress Credit
Follow us
Subhash Goud

|

Updated on: Jul 16, 2022 | 12:04 PM

SBI Real Time Xpress Credit: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల సౌలభ్యం కోసం గొప్ప సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు ఇప్పుడు ఇంట్లో కూర్చొని రూ. 35 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. పెరుగుతున్న డిజిటలైజేషన్ యుగంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఆన్‌లైన్‌లో వివిధ సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో SBI తన కస్టమర్ల కోసం ఇంట్లో కూర్చొని వ్యక్తిగత రుణం పొందే సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది. దాని పేరు ‘రియల్ టైమ్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్’.

ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు కొన్ని సులభమైన దశల్లో రూ. 35 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీరు స్టేట్ బ్యాంకుకు చెందిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో యాప్ ద్వారా ఈ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ సదుపాయం వివరాలను తెలుసుకోండి.

ప్రతి కస్టమర్ SBI ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోలేరని గుర్తించుకోండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లోన్‌ ధృవీకరణ తర్వాత మీరు ఆదాయ ధృవీకరణ పత్రం, ITI ఫారం, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి మీ అన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. అలాగే లోన్ ఇచ్చే ముందు మీ CIBIL స్కోర్ కూడా చెక్ చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

‘రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్’ ద్వారా మీరు పూర్తి 35 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో మీరు ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోన్ అప్రూవల్ ప్రక్రియ కూడా YONO యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. దీని గురించి మరింత సమాచారం పొందడానికి మీరు SBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి