- Telugu News Photo Gallery GST on dairy products packed milk curd products hospital charge will hike too from 18 july
GST Hike: సామాన్యుడికి దడ పుట్టిస్తోన్న జీఎస్టీ.. ఈ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయ్.. జూలై 18 నుంచి అమలు
GST Hike: రోజూ తినే పెరుగుతో పాటు ప్యాక్ చేసి లేబుల్ వేసిన మజ్జిగ, పన్నీర్, లస్సీ వంటి పాల ఉత్పత్తి ధరలు జీఎస్టీ కారణంగా భారీగా పెరగనున్నాయి. అంతేకాదు..సెలవులు ఉన్నాయి కదా..
Updated on: Jul 17, 2022 | 7:18 AM

GST Hike: రోజూ తినే పెరుగుతో పాటు ప్యాక్ చేసి లేబుల్ వేసిన మజ్జిగ, పన్నీర్, లస్సీ వంటి పాల ఉత్పత్తి ధరలు జీఎస్టీ కారణంగా భారీగా పెరగనున్నాయి. అంతేకాదు..సెలవులు ఉన్నాయి కదా అని ఫ్యామిలీతో ఏ టూర్ ప్లాన్ చేసినా ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఇకపై ఇకపై వెయ్యి రూపాయలలోపు గది తీసుకున్నా 12 శాతం జీఎస్‌టీ కంపల్సరీ చెల్లించాల్సిందే. జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో రేట్ల పెంపు నిర్ణయంతో సామాన్యుడిలపై మరింత భారం పడనుంది. జులై 18 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి రానున్నాయి.

ప్యాక్ చేసిన లేబుల్డ్ గోధుమపిండి, అప్పడాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ, లస్సీ, మాంసం , చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లు-మఖానా, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ పైనా ఇక నుంచి 5 శాతం జీఎస్టీ పడుతుంది. అయితే, ప్యాక్ చేయని, లేబుల్ వేయని, అన్‌బ్రాండెడ్ ఉత్పత్తులకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇక ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్‌లపై పన్ను 12 నుంచి 18 శాతానికి పెంచారు. కత్తులు, కటింగ్ బ్లేడ్లు, పేపర్ కత్తులు, పెన్సిల్ చెక్కుకునే షార్ప్‌నర్లపైనా ఇకపై 18% పన్ను వర్తించనుంది. వీటితోపాటు LED లైట్లు, ఫిక్సర్, వాటికి వినియోగించే మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్‌బోర్డులపై 12 నుంచి 18 శాతానికి పెంచారు.

కొన్ని వస్తువులు పెరిగితే..మరికొన్నింటిపై తగ్గించారు. ఆస్టమీ, కొన్ని ఆర్థోపెడిక్ పరికరాలపై పన్నురేటు 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. మొత్తానికి జీఎస్టీ ధరల పెంపు సామాన్యుడిపై మరింత బారం పడుతోంది.




