Oppo Pad Air: భారత మార్కెట్లోకి ఒప్పో కొత్త ట్యాబ్.. రూ. 15 వేలలో అదిరిపోయే ఫీచర్లు..
Oppo Pad Air: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో కొత్త ట్యాబ్ లాంచ్ చేస్తోంది. జూలై 18న భారత మార్కెట్లోకి వస్తోన్న ఒప్పో ప్యాడ్ ఎయిర్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు...
Updated on: Jul 17, 2022 | 6:55 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేస్తోంది. ఒప్పో ఎయిర్ పేరుతో ఈ ట్యాబ్‌ను విడుదల చేయనున్నారు.

షావోమీ ప్యాడ్ 5, మోటో ట్యాబ్ జీ70లకు పోటీగా ఈ ట్యాబ్‌ను తీసుకొస్తోంది ఒప్పో. ఈ ట్యాబ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 10.36 ఇంచెస్ 2కే డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది.

ఇందులో 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 7100 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ధర విషయానికొస్తే రూ. 15,100గా ఉండనుంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ స్పీకర్లు ఈ ట్యాబ్ ప్రత్యేకత.




