Income Tax Rules: డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి.. లేకపోతే టాక్స్ తిప్పలు తప్పవు

Income Tax Rules: నేను కష్టపడి సంపాదించుకున్నాను.. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాను.. ఈ మాటలు చాలా సందర్భాలలో మనం అంటూవుంటాం. ముఖ్యంగా మన పెద్ద వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయమన్నపుడు..

Income Tax Rules: డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి.. లేకపోతే టాక్స్ తిప్పలు తప్పవు
Income Tax Rules
Follow us
Subhash Goud

|

Updated on: Jul 18, 2022 | 5:37 PM

Income Tax Rules: నేను కష్టపడి సంపాదించుకున్నాను.. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాను.. ఈ మాటలు చాలా సందర్భాలలో మనం అంటూవుంటాం. ముఖ్యంగా మన పెద్ద వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయమన్నపుడు ఇలా అనడం సహజం. ఇలా అనడం వరకూ ఓకే. కానీ, అలా డబ్బును ఇస్తాం వచ్చినట్టు ఖర్చు చేస్తే ఇన్ కం టాక్స్ డిపార్ట్‌మెంట్‌ మాత్రం అసలు ఊరుకోదు. ఆ ఖర్చుల లెక్కలన్నీటినీ బయటకు తీసి నోటీసులు పంపిస్తుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ మన ఖర్చులపై ఎలా కన్ను వేస్తోంది.. ఎందుకు ఆ లెక్కలు చూస్తోంది.. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులకు చెందిన ప్రతి లావాదేవీపై కన్నేసింది. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఖర్చులు చేస్తున్నారు..? ఏ రకమైన లావాదేవీలను నిర్వహిస్తున్నారు..? వంటి వాటిని పరిశీలిస్తోంది. ఒకవేళ నిర్దేశిత పరిమితి మంచి ఎవరైనా లావాదేవీలు చేసి.. వాటిని ఐటీఆర్(ITR) ఫైలింగ్‌లో కనుక పేర్కొనకపోతే.. ఆదాయపు పన్ను విభాగం వారికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతుంది. అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో ప్రతి లావాదేవీపై కన్నేస్తోంది. వీటిపై పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించేందుకు.. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఏయే లావాదేవీలపై ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ కన్నేసిందో ముందుగానే తెలుసుకుంటే ఆదాయపు పన్ను విభాగానికి చెందిన నోటీసుల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఆరు రకాల లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ ఎక్కువగా ఫోకస్ చేసింది.

రూ.10 లక్షలకు మించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే..

ఇవి కూడా చదవండి

నిర్దేశిత పరిమితికి మించి సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలో డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసిన ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను విభాగానికి తెలుపాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేసినా లేదా విత్ డ్రా చేసినా ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను విభాగానికి తెలుపాల్సి ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అకౌంట్లో రూ.50 లక్షలకు మించితే వివరణ ఇవ్వాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులో రూ.10 లక్షలకు మించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను విభాగం నుంచి మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఫామ్ 61ఏ ద్వారా ఈ సమాచారాన్ని బ్యాంకు ఆదాయపు పన్ను విభాగానికి తెలియజేస్తుంది. సింగిల్ ఎఫ్‌డీ అయినా లేదా మల్టిపుల్ ఎఫ్‌డీలైనా.. ఈ సమాచారాన్ని తప్పనిసరిగా ఆదాయపు పన్ను విభాగానికి తెలుపాలి.

క్రెడిట్ కార్డు బిల్లు రూ.లక్షపైన ఉంటే..

ఒకవేళ మీ క్రెడిట్ కార్డు బిల్లు రూ.లక్షపైన ఉంటే.. ఆదాయపు పన్ను విభాగానికి ఆ విషయం తెలపాలి. అంతేకాక రూ.10 లక్షలకు మించి క్రెడిట్ కార్డు సెటిల్‌మెంట్ చేస్తే కూడా ఆ సమాచారాన్ని ఐటీ విభాగానికి తెలియజేయాలి. లేదంటే మీకు నోటీసులు వస్తాయి. రూ.30 లక్షలకు మించి స్థిరాస్తులను ఎవరైనా కొన్నా లేదా అమ్మినా ఆ సమాచారాన్ని రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లు ఆదాయపు పన్ను విభాగానికి చెబుతారు. ఒకవేళ మీరు ఐటీఆర్‌లో ఈ లావాదేవీని పేర్కొనకపోతే.. మీకు నోటీసులు వస్తాయి.

ఒక ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్ల పెట్టుబడి పరిమితి రూ.10 లక్షలకు మించితే మీరు తప్పనిసరిగా ఆ సమాచారాన్ని డిస్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ రిటర్ను స్టేట్‌మెంట్‌లో ఆ లావాదేవీల వివరాలు పేర్కొనాలి. ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి విదేశీ కరెన్సీలను విక్రయిస్తే కూడా మీరు ఆదాయపు పన్ను విభాగం కనుసన్నల్లోకి వచ్చేస్తారు. మీరు తప్పనిసరిగా ఆ లావాదేవీని ఐటీ డిపార్ట్‌మెంట్‌కి తెలుపాల్సి ఉంటుంది. అదీ విషయం. ఇప్పుడు మీకు తెలిసింది కదా.. ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటో. ఇన్ కం టాక్స్ విభాగం కన్నేసి ఉంచిన ఈ ఆరు అంశాలనూ జాగ్రత్తగా అర్ధం చేసుకోండి. ఎందుకంటే అర్ధం చేసుకుంటే అంతా సులువే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి