Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Center: మీ దగ్గరలో ఆధార్‌ సెంటర్‌ ఎక్కడుందో తెలియడం లేదా.. ఇలా సులభంగా తెలుసుకోవచ్చు

Aadhaar Center: ప్రస్తుతం ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరికి తప్పనిసరైంది. ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఆధార్‌ లేనిది ఏ పనులు జరగడం లేదు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేటు పథకాలతో పాటు ఇతర చిన్నపాటి..

Aadhaar Center: మీ దగ్గరలో ఆధార్‌ సెంటర్‌ ఎక్కడుందో తెలియడం లేదా.. ఇలా సులభంగా తెలుసుకోవచ్చు
Aadhaar Center
Follow us
Subhash Goud

|

Updated on: Jul 18, 2022 | 7:58 PM

Aadhaar Center: ప్రస్తుతం ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరికి తప్పనిసరైంది. ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఆధార్‌ లేనిది ఏ పనులు జరగడం లేదు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేటు పథకాలతో పాటు ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. గతంలో ఆధార్‌ పొందిన వారికి ఎన్నో తప్పులు జరిగాయి. పేరులో తప్పు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇలా ఎన్నో తప్పులు జరిగాయి. తర్వాత వాటిని సరి చేసుకోవాలంటే ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సిందే. ఇక పెళ్లైన తర్వాత ఇంటి పేరు మార్పు, కొత్త ఆధార్‌ పొందాలంటే దగ్గరలోని ఆధార్‌ సెంటర్‌ను సంప్రదించాల్సిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్‌ సెంటర్‌ తెలుసుకోవడం సులభమే. కానీ హైదరాబాద్‌ లాంటి పెద్ద పట్టణాల్లో ఆధార్‌ సెంటర్‌ ఎక్కడుందో తెలుసుకోవడం చాలా కష్టం. అటువంటి సమయంలో మీ దగ్గరలో ఎక్కడుందో తెలుసుకునే సదుపాయం కూడా ఉంది.

అయితే మీ సమీపంలోని ఆధార్‌ సెంటర్‌ గూగుల్‌ మ్యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అది అప్పుడప్పుడు సరిగ్గా చూపించదు. అలాంటి సమస్య ఉండకుండా ఆధార్‌ జారీ సంస్థ ఉడాయ్‌ (UIDAI) ఇస్రోతో జతకట్టింది. ఇస్రోకు అనుబంధంగా పనిచేసే నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ తో కలిసి ‘భువన్‌ ఆధార్‌’ అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ పోర్టల్‌లో మూడు రకాల ఫీచర్స్‌:

ఈ పోర్టల్‌లో మూడు రకాల ప్రీమియం ఫీచర్స్‌ ఉన్నాయి. మీ సమీపంలోని ఆధార్‌ కేంద్రాలను తెలుసుకోవడంతో పాటు వాటి వద్దకు వెళ్లే మార్గం కూడా చూపించే సదుపాయం ఉంది. ఇది వరకు ఆధార్‌ వివరాలను ధృవీకరించాలంటే ఐరిస్‌, వేలిముద్రలు స్కాన్‌ చేయాల్సి ఉండేది. కానీ UIDAI ఇటీవల ఆధార్‌ ఫేస్‌ఆర్‌డీ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంట్లోనే ఉండి మీ ముఖాన్ని స్కాన్‌ చేయడం ద్వారా ఆధార్‌ వివరాలను ధృవీకరించుకోవచ్చని తెలిపింది. ఈ యాప్‌ ఇటీవల అందుబాటులోకి రావడంతో ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

గూగుల్‌లో ఎలా వెతకాలి..

ముందుగా గూగుల్‌లోకి వెళ్లి ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. ఈ లింక్‌ పోర్టల్‌లోకి వెళ్లి స్క్రీన్‌కు ఎడమ వైపు నాలుగు డ్రాప్‌ డౌన్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. మీ సమీపంలో ఉండే ఆధార్‌ నమోదు కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లలో ‘సెంటర్స్‌ నియర్‌బై’ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే మీకు దగ్గరలో ఉన్న కేంద్రాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీంతో ఆధార్‌ కేంద్రాల కోసం వెతికే పని లేకుండా ఇంట్లోనే ఉండి మొబైల్‌లో తెలుసుకుని వెళ్లవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి