ఆవుల్లో వేగంగా వ్యాపిస్తున్న భయంకర అంటువ్యాధి..! పదుల సంఖ్యలో మృత్యువాత.. తీవ్ర భయాందోళనలో రైతులు

ఆవులలో కనిపించిన ఇన్ఫెక్షన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఆవులు చనిపోయాయి. ఆవులకు అంటువ్యాధులు సోకి వేగంగా చనిపోవడంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో

ఆవుల్లో వేగంగా వ్యాపిస్తున్న భయంకర అంటువ్యాధి..! పదుల సంఖ్యలో మృత్యువాత.. తీవ్ర భయాందోళనలో రైతులు
Cow
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 18, 2022 | 3:48 PM

రాజస్థాన్‌, పాకిస్థాన్‌కు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లోని ఆవులకు వింత ఇన్ఫెక్షన్ కలకలం సృష్టించింది. జోధ్‌పూర్ గ్రామీణ ప్రాంతాలు, జైసల్మేర్‌తో సహా ఇతర ప్రాంతాలలో ఆవులలో కనిపించిన ఇన్ఫెక్షన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఆవులు చనిపోయాయి. ఆవులకు అంటువ్యాధులు సోకి వేగంగా చనిపోవడంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఆవులకు ఇన్ఫెక్షన్ సోకిన పరిస్థితిని చూసి ఆరోగ్య శాఖలోనూ ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఆవులలో ఈ ఇన్ఫెక్షన్ జోధ్‌పూర్ గ్రామీణ ప్రాంతాలు, జైసల్మేర్‌తో సహా పరిసర ప్రాంతాల్లో కనిపించింది . అదే సమయంలో, మీడియా కథనాల ప్రకారం, జోధ్‌పూర్‌లోని లోహవత్ పల్లి II గ్రామంలో గత రెండు-మూడు రోజుల్లో, ఈ అంటు వ్యాధి కారణంగా సుమారు 40 ఆవులు మరణించాయి.

జోధ్‌పూర్, జలోర్, బార్మర్, జైసల్మేర్‌లోని పోకరన్ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా ఆవుల శరీరాలపై ఇన్‌ఫెక్షన్ కనిపిస్తోంది. గత 3-4 రోజులుగా ఈ ఇన్‌ఫెక్షన్ ఆవుల్లో వేగంగా వ్యాపిస్తోంది. దాంతో రైతులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.

ఈ ఇన్ఫెక్షన్ ఆవులలో అకస్మాత్తుగా వ్యాపిస్తుంది. వింత వ్యాధికి సంబంధించిన అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఆవు శరీరమంతటా..గడ్డలు, గడ్డలుగా ఏర్పడుతుంది. ఆ తర్వాత కొంతసేపటికే అవి చనిపోతున్నాయి. అదే సమయంలో, చాలా ఆవులలో ఈ వ్యాధి కారణంగా, పుట్టబోయే ఆవు దూడలు కూడా కడుపులోనే చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆవులకు అంటువ్యాధి సోకిందనే సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ రంగంలోకి దిగింది. పల్లి గ్రామంలో 40కి పైగా ఆవులు మృతి చెందడంతో పశువైద్యుల గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలో అనారోగ్యంతో ఉన్న 28 ఆవుల నమూనాలను సేకరించి టెస్టులకు పంపించారు. అన్నీ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి పశువులకు వచ్చిన ఆ వింత వ్యాధి ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం.. జోధ్‌పూర్‌లోని పశువైద్యుడు డాక్టర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, ఆవులలో వ్యాపించే ఈ వ్యాధి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చనిపోయిన ఆవులను సురక్షితమైన స్థలంలో పాతిపెట్టాలని పశువుల యజమానులకు డిపార్ట్‌మెంట్ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి