AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వరద నీటిలో చెల్లెలి కోసం బుడ్డొడి సాహసం.. పొగుడుతున్న నెటిజన్స్..

ఈ అన్న చేసిన పని పెద్దలకు గుణపాఠంగా ఉందంటున్నారు నెటిజన్లు. చెల్లెలిపై అన్న ప్రేమను చూపించే ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్‌ చేస్తున్నారు.

Viral Video: వరద నీటిలో చెల్లెలి కోసం బుడ్డొడి సాహసం.. పొగుడుతున్న నెటిజన్స్..
Brother Help Sister
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2022 | 2:20 PM

Share

Viral Video: అన్న అంటే నాన్నలో సంగం అంటారు. చెల్లెలికి ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేడు. నాన్న లేని లోటును తీరుస్తాడు. చెల్లెలి కోసం అన్నయ్య ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. తండ్రి తన కూతురిని ఎలా చూసుకుంటాడో అన్నయ్య తన చెల్లిని అలాగే చూసుకుంటాడు. ఈ మధ్య కాలంలో అన్నదమ్ముల బంధాన్ని అందంగా చూపించిన ఇలాంటి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ అన్నను ప్రశంసలతో ముంచేతుతున్నారు.

వీడియోలో ఒక అన్న తన చెల్లెలిని తన వీపుపై మోసుకెళ్తున్నాడు. వీడియోలో అన్నా చెల్లెలు ఇద్దరూ స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్నారు. కానీ, వారు వెళ్తున్న రోడ్డు నిండా వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో రోడ్డు దాటేందుకు అతడి చెల్లెలు ఒకింత భయం, వెనుకడుగు వేసింది. దాంతో ఆ అన్నయ్య చెల్లెల్ని తన వీపుపై మోసుకుంటూ తన బూట్లు కూడా తడవకుండా తీసుకెళ్తాడు. ఇవతలి రోడ్డు నుంచి వరద దాటి చెల్లెలిని ఒడ్డుకు చేర్చాడు. ఈ అన్న చేసిన పని పెద్దలకు గుణపాఠంగా ఉందంటున్నారు నెటిజన్లు. చెల్లెలిపై అన్న ప్రేమను చూపించే ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @TheFigen అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో చేశారు. చేసారు. వార్తలు రాసే వరకు, 15 లక్షల మందికి పైగా చూశారు. కామెంట్ల ద్వారా తమ అమూల్యమైన అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్నాచెల్లెలి అందమైన బంధం నిజంగా అద్భుతమైనది. అంటూ ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా, మరొకరు ‘ఈ చిన్న పిల్లలు పెద్దలకు సంబంధాల విలువను నేర్పించారు అంటూ కామెంట్‌ చేశారు. ఇంకా వేల సంఖ్యలో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కామెంట్ బాక్స్‌లో చాలా ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి