T20 World Cup: వర్షం ఎఫెక్ట్.. సూపర్ 8లో ఒక్క మ్యాచ్ ఆడకున్నా సెమీ ఫైనల్‌కు టీమిండియా! ఎలాగంటే?
టీ ప్రపంచ కప్ కీలకమైన దశలో వరుణుడు విలన్ గా మారుతున్నాడు. ఇప్పటికే వర్షం కారణంగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ రద్దవగా మరికొన్ని మ్యాచ్ ల పరిస్థితి కూడా అదేనని తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

టీ20 ప్రపంచ కప్ సూపర్-8 రౌండ్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కొలంబోలో భారీ వర్షం కారణంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం (ఫిబ్రవరి 21) జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు అయ్యింది. దీంతె రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. తద్వారా పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. ఇప్పుడు ఈ జట్లు నాకౌట్ దశకు చేరుకోవాలంటే మిగతా అన్ని మ్యాచ్ లు తప్పనసరిగా గెలవాల్సి ఉంది. అలాగే ఇతర జట్ల మ్యాచ్ లపై కూడా ఆధారపడాల్సి ఉంది. ఈ క్రమంలో గ్రూప్-లోని తదుపరి మ్యాచ్‌లు కూడా వర్షం వల్ల ప్రభావితమై, అన్ని జట్లకు సమాన పాయింట్లు లభిస్తే, ఎవరికి అవకాశం ఉందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు మొదటి సమాధానం నెట్ రన్ రేట్. అంటే, పాయింట్ల పట్టికలో రెండు కంటే ఎక్కువ జట్లు సమాన పాయింట్లు కలిగి ఉంటే, ఎక్కువ నెట్ రన్ రేట్ ఉన్న జట్టు తదుపరి దశకు చేరుకుంటుంది. మరి పాయింట్లు, నెట్ రన్ రేట్ కూడా సమానంగా ఉంటే ..
ఇలాంటి పరిస్థితుల్లో టోర్నమెంట్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అంటే గ్రూప్ స్టేజ్ లో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన జట్టు సెమీస్ కు చేరుతుంది. ఒక వేళ టోర్నమెంట్‌లో రెండు జట్లు సమాన విజయాలు సాధించినట్లయితే వారి హెడ్-టు-హెడ్ మ్యాచ్‌లలో ఎక్కువ గెలిచిన జట్టు తదుపరి దశకు చేరుకుంటుంది. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లలో (ప్రపంచ కప్ లాంటి టోర్నమెంట్లు), ప్రతిదీ సమానంగా ఉన్నప్పుడు, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఉన్న ICC జట్టు ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అంటే, విజయాలు, నెట్ రన్ రేట్, హెడ్-టు-హెడ్ అన్నీ సమానంగా ఉంటే, ఈ ICC ర్యాంకింగ్‌లో ఎక్కువగా ఉన్న జట్టు తదుపరి దశకు చేరుకుంటుంది.
దీని అర్థం ICC టోర్నమెంట్లలో పాయింట్లు, విజయాలు, నెట్ రన్ రేట్, హెడ్ టు హెడ్ అన్నీ సమానంగా ఉన్నప్పటికీ, ICC జట్టు ర్యాంకింగ్స్ చివరికి తదుపరి దశకు జట్లను ఎంచుకోవడానికి ఉపయోగం కానుంది. అందువల్ల, ప్రస్తుత టోర్నమెంట్‌లో జట్ల పాయింట్లు, విజయాలు, నెట్ రన్ రేట్ అన్నీ సమానంగా ఉన్నప్పటికీ, 4 జట్లు సూపర్-8 రౌండ్ నుండి తదుపరి దశకు చేరుకోవడం ఖాయం. ప్రస్తుతం అంతర్జాతీయ T20I ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. కాబట్టి వర్షం కారణంగా అన్ని మ్యాచ్ లు రద్దైతే టీమిండియా సూపర్-8లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సెమీఫైనల్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




