AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే

ఎలాంటి అంచనాలు లేకుండా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లవ్‌ స్టోరీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బరిలో విశ్వక్ సేన్ ఫంకీ లాంటి సినిమాలున్నా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ టీమ్ ఆడియెన్స్ కు ఒక బంపరాఫర్ ప్రకటించింది.

Cinema: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
Nilave Movie
Basha Shek
|

Updated on: Feb 21, 2026 | 6:35 AM

Share

సౌమిత్‌ పోలాడి, శ్రేయాసి సేన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం నిలవే. సౌమిత్‌, సాయి కే వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. పోటీగా ఫంకీ, సీతా పయనం వంటి సినిమాలున్నా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటి వరకు ర. కోటీకిపైగా గ్రాస్‌ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ పెరుగుతుండడంతో ఈ సినిమా స్క్రీన్స్ కూడా పెరుగుతున్నాయి. మొదటి వారం 60థియేటర్లలో విడుదలయితే, రెండో వారం 75 థియేటర్లు పెరగడం విశేషం. ఈ క్రమంలో ప్రేక్షకుల కోసం చిత్ర బృందం ఒక మంచి ఆఫర్‌ ప్రకటించింది. ఈ శనివారం రూ.11 కే టికెట్‌ అని ప్రకటించింది. 11 పాటలు, 11 ఎమోషన్స్ ఉన్నాయని చెప్పి, పదకొండు రూపాయలకే టికెట్‌ని ప్రకటించారు. తద్వారా తమ సినిమాను మరింత మంది చూసే అవకాశం కల్పించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

ఈ సందర్బంగా హీరో సౌమిత్‌ మాట్లాడుతూ, `కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మూడేళ్ల కష్టమే ఈ నిలవే సినిమా. ది గ్రేట్ రాజమౌళి కూడా ‘బాహుబలి’ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా ‘నిలవే’ మాకు ‘బాహుబలి’ లాంటిది. ఈ ప్రయాణంలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్‌ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

రూ..11కే నిలవే సినిమా టికెట్.. శనివారం మాత్రమేనా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us