AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ’ మూవీకి మరో బిగ్ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు.. సినిమా రిలీజ్ అయ్యేనా?

వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ 2' ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటోంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయ స్థానం సినిమా నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.. అలాగే..

The Kerala Story 2: 'ది కేరళ స్టోరీ' మూవీకి మరో బిగ్ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు.. సినిమా రిలీజ్ అయ్యేనా?
The Kerala Story 2 Movie
Basha Shek
|

Updated on: Feb 21, 2026 | 7:53 AM

Share

‘ది కేరళ స్టోరీ 2’ సినిమాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి . ఈ సినిమాలో మతపరమైన అంశాలు ఉన్నందున చాలా మంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేరళలో ఇప్పటికే ఈ సినిమాపై ఆగ్రహ జ్యాలలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని తర్వాత, సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది . దీని వల్ల చిత్ర బృందం మరిన్ని చిక్కుల్లో పడినట్లయ్యింది. ‘ది కేరళ స్టోరీ 2′ సినిమాపై కన్నూర్‌కు చెందిన శ్రీదేవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో మతపరమైన అల్లర్లకు దారితీసే అంశాలు ఉన్నాయి. దీనివల్ల శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని కూడా ప్రశ్నించారు. ది కేరళ స్టోరీ 2’ సినిమా ట్రైలర్‌లో కేరళలో లవ్ జిహాద్ ద్వారా హిందూ అమ్మాయిలను మతం మార్చి హింసిస్తున్నట్లు చూపించారు. కానీ చాలా మంది దీనిని వ్యతిరేకించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది.

కాగా ఈ విషయంపై విచారణ ఫిబ్రవరి 24న జరగనుంది.మరోవైపు, ఫిబ్రవరి 27న సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 24న జరిగే విచారణలో చిత్ర బృందానికి ఎదురుదెబ్బ తగిలితే, విడుదలపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు మొదలైన వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రానికి కామాక్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. దీనిని విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ చిత్రంలో అదితి భాటియా, ఐశ్వర్య ఊజా, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనుంది. మొదటి భాగం రిలీజ్ విషయంలో కూడా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. కానీ ఆ తర్వాత అవే సినిమాకు ప్లస్ గా మారాయి. ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టాయి.

2023లో 20 కోట్లతో తెరకెక్కి.. 300 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు రేపింది కేరళ స్టోరీ. విజయం కంటే ఎక్కువ వివాదాలను మూటగట్టుకున్న ఈ సినిమాపై రాజకీయాలు కూడా నడిచాయి. కొన్ని పార్టీలు ఈ మూవీని వ్యతిరేకిస్తే మరికొన్ని పార్టీలు అనుకూలంగా వ్యవహరించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us