Viral Video: పాముతో నక్రాలు చేస్తే ఇట్లనే ఉంటది మచ్చా.. సరదా కస్త దూలతీరేలా చేసింది.. ఏకంగా కంటిపై..
సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయంతో పరుగులు తీస్తుంటారు. అవి దగ్గరగా కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Snake Viral Video: సాధారణంగా పాములను చూస్తేనే భయపడుతుంటారు. ఇటీవల కాలంలో పాములకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. పాముకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయంతో పరుగులు తీస్తుంటారు. అవి దగ్గరగా కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వాటిని నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు పాము కెమెరాకు ఫోజులిచ్చాయి. ఈ సమయంలో పాము దిమ్మతిరిగే షాకిచ్చింది. పామును పట్టుకొని ఫోజులిస్తుండగా పాము కనుబొమ్మపై కాటువేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. వేలాది మంది వీక్షించడంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పాము కాటు వేసిన దృశ్యాన్ని చూసి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
వైరల్ వీడియో..
View this post on Instagram
ఈ వీడియోను snake._.world అనే యూజర్ షేర్ చేయగా.. పలువురు కామెంట్లు చేశారు. ఈ పాము విషపూరితమైనదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా పాములకు దూరంగా ఉండాలని.. విషపూరితమైన వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.