AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి మండపంలోకి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన వధువు.. స్టేజీపైనే ఏడ్చేసిన వరుడు..!

పెళ్లి వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. అది వధూవరులకు మరుపురాని క్షణం. సాధారణంగా, వధూవరుల నుండి అతిథుల వరకు అందరూ అందంగా ముస్తాబవుతారు, కానీ వధువు తన పెళ్లికి అందంగా ముస్తాబవ్వకుండా స్కూల్ యూనిఫాం ధరించి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి? అవును, అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: పెళ్లి మండపంలోకి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన వధువు.. స్టేజీపైనే ఏడ్చేసిన వరుడు..!
Bride Surprise Groom
Balaraju Goud
|

Updated on: Feb 21, 2026 | 3:32 PM

Share

పెళ్లి వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. అది వధూవరులకు మరుపురాని క్షణం. సాధారణంగా, వధూవరుల నుండి అతిథుల వరకు అందరూ అందంగా ముస్తాబవుతారు, కానీ వధువు తన పెళ్లికి అందంగా ముస్తాబవ్వకుండా స్కూల్ యూనిఫాం ధరించి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి? అవును, అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి కథ తెలుసుకున్న తర్వాత నెటిజన్లు షాక్ అవుతున్నారు. వారిని అభినందిస్తున్నారు. ఈ వీడియోలో , వధువు సాంప్రదాయ లెహంగాకు బదులుగా స్కూల్ యూనిఫాం ధరించి పెళ్లి మండపంలోకి ప్రవేశించింది. వరుడు ఆమెను చూసిన వెంటనే ఆనంద బాష్పాలు కార్చారు.

వివాహ వేదిక ప్రవేశ ద్వారం గుండా ఒక యువతి లోపలికి ప్రవేశించింది. ఆమె స్కూల్ యూనిఫాం ధరించి, పూల గుత్తి పట్టుకుని ఉంది. ఆ తర్వాత ఆమె నేరుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లింది. అక్కడ వరుడు సూట్, బూట్ ధరించి, దర్జాగా నిలబడి ఉన్నాడు. ఇంతలో వెనక్కు నిలబడి ఉన్న వరుడిని పలకరించిన యువతి అతనికి బొకే ఇచ్చింది. వచ్చింది ఎవరో చూసి వరుడు షాక్ అయ్యాడు. వెంటనే ఆనందం తట్టుకోలేక ఏడ్చేశాడు. తన వధువును స్కూల్ యూనిఫాంలో చూసినప్పుడు, అతను మొదట ఆశ్చర్యపోయాడు, కానీ తరువాత భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ అమ్మాయి వెంటనే అతన్ని కౌగిలించుకుంది. ఈ వీడియో వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ అందమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @TAdventurousoul అనే ఖాతా పేరుతో షేర్ చేశారు. “ఆమె తన పెళ్లి రోజున అతనిని ఆశ్చర్యపరిచేందుకు స్కూల్ యూనిఫామ్‌ను ధరించింది. వారు స్కూల్ నుండి ప్రేమలో ఉన్నారు” అని క్యాప్షన్ ఉంది. ఈ 24 సెకన్ల వీడియోను 3.7 మిలియన్ సార్లు వీక్షించారు, 20,000 మంది దీనిని లైక్ చేశారు. వివిధ రకాల ప్రతిస్పందనలు తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు, “తొలి ప్రేమ ఎప్పటికీ ప్రేమగా మారినప్పుడు… అది ఏ సినిమా కంటే మెరుగ్గా అనిపిస్తుంది.” అని రాశారు. మరొకరు, “ఇది కేవలం ప్రేమ కాదు… ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.” అని పేర్కొన్నారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?
నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. ఇప్పుడు స్టార్ హీరో..
ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. ఇప్పుడు స్టార్ హీరో..