Maoist Movement: ముగిసిన మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం..! లొంగిపోయిన పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి..
ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్‌లో అగ్రనేతలు లొంగిపోయారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) ముందు మావోయిస్టు అగ్రనేతలు సరేండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు.

ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్‌లో అగ్రనేతలు లొంగిపోయారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) ముందు మావోయిస్టు అగ్రనేతలు సరేండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. ఆసిఫాబాద్ అడవుల్లో దేవ్‌జీతోపాటు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి సైతం లొంగిపోయారు. ఒకట్రెండు రోజుల్లో లొంగుబాటుపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీకి దేవ్‌జీ సారధ్యం వహిస్తున్నారు. తిప్పిరి తిరుపతి సొంత జిల్లా పెద్దపల్లి.. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీతోపాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. సోమవారం లేదా మంగళవారం మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అగ్రనేత గణపతి ఇప్పటికే అనారోగ్యంతో విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
ముగిసిన మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం?
మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం దాదాపు ముగిసిపోయినట్లు కనిపిస్తోంది.. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే పార్టీ ఉనికి కోల్పోయింది. ఈ క్రమంలోనే.. అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ కావడంతో.. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు పడినట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్‌లో వందలమంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31కల్లా ఆపరేషన్ కగార్‌కు గడువు పెట్టుకున్న కేంద్రప్రభుత్వం.. ఆ దిశగా.. అడవులన్నింటినీ జల్లెడ పడుతోంది. ఇప్పటికే హిడ్మా వంటి కీలక మావోయిస్టుల ఎన్‌కౌంటర్ అయ్యారు.. మొన్నీమధ్యే మల్లోజుల, ఆశన్న తదితర నేతలు సైతం లొంగిపోయారు.. దీంతో ఆపరేషన్ కగార్ దాదాపు చివరి దశకు వచ్చినట్లు కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
