AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Govt Jobs 2026: నెలకు రూ.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీ.. సైంటిస్ట్‌ సి గేజిటెడ్‌ గ్రూప్‌ ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10 సైంటిస్ట్‌ సి ఉద్యోగాలను భర్తీ చేయనుంది..

Central Govt Jobs 2026: నెలకు రూ.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే
Department Of Biotechnology Jobs
Srilakshmi C
|

Updated on: Feb 22, 2026 | 7:59 AM

Share

భారత ప్రభుత్వం ఆధీనంలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీ.. సైంటిస్ట్‌ సి గేజిటెడ్‌ గ్రూప్‌ ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10 సైంటిస్ట్‌ సి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో (ఫిలాసఫీ, లైఫ్‌ సైన్సెస్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కంప్యూటేషనల్‌, ఫార్మీక్యూటికల్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ సైన్సెస్‌, ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, కెమికల్‌, బయోమెడికల్‌, బయోటెక్నాలజీ, బయోఫార్మ, డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌) పీహెచ్‌డీ, ఎండీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 35 సంవత్సరాలోపు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 14, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.2000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఉంటుంది. 120 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ A, B విభాగాలకు పరీక్ష ఉంటుంది. పేపర్‌ Aలో జనరల్‌ ఆప్టిట్యూట్‌, పేపర్ Bలో సైంటిఫిక్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీలో సైంటిస్ట్‌-సి ఉద్యోగాల ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us