AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Police Internship 2026: హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు.. ఎవరు అర్హులంటే?

డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్ధులకు డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రాంలను ప్రారంభిస్తోంది. 25 ఏళ్లలోపు వయస్సు ఉన్న డిగ్రీ విద్యార్థులు ఎవరైనీ ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధునిక పోలీసింగ్‌లో యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌ పోలీస్‌ విభాగం..

Hyderabad Police Internship 2026: హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు.. ఎవరు అర్హులంటే?
Hyderabad Police Internship
Srilakshmi C
|

Updated on: Feb 22, 2026 | 9:15 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమం తీసుకువచ్చింది. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్ధులకు డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రాంలను ప్రారంభిస్తోంది. 25 ఏళ్లలోపు వయస్సు ఉన్న డిగ్రీ విద్యార్థులు ఎవరైనీ ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధునిక పోలీసింగ్‌లో యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌ పోలీస్‌ విభాగం ఈ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది.

హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ ప్రక్రియ రాష్ట్ర పోలీస్ శాఖలోని ఎస్‌ఎమ్‌ఐటీ (SMIT) సెల్ పర్యవేక్షణలో ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు అధికారికంగా సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఎంపికైన వారికి డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టులు, ఆధునిక పోలీసింగ్ పద్ధతులకు సంబంధించిన పనులను కేటాయిస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా, వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులు కూడా ‘వాలంటీర్’గా చేరి తమ సేవలను అందించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు హైదరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు పోలీసు అధికారులతో కలిసి పనిచేస్తూ ఈ శాఖ పనితీరులో సరికొత్త ఆలోచనలను జోడించడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు నేర పరిశోధన, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా పోలీసింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 26కు దరఖాస్తులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలో పీజీ లాసెట్‌-26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లాసెట్‌ కన్వీనర్, మహిళా వర్సిటీ న్యాయవిభాగం ప్రొఫెసర్‌ సీతాకుమారి తెలిపారు. 3, 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 12, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆలస్య రుసుముతో మార్చి 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మే 4న ప్రవేశ పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?