AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌత్ సినిమాపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. అందరి ముందు అలా అవమానించారంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గించింది.

సౌత్ సినిమాపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. అందరి ముందు అలా అవమానించారంటూ..
Taapsee Pannu
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2026 | 12:14 PM

Share

2010లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఝుమ్మంది నాథం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ పన్ను. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు.. ఆ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో నటిస్తూనే కోలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంది. ధనుష్ సరసన ఆడుకలం సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం అంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రభాస్ జోడిగా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో మెరిసింది. రవితేజతో వీర సినిమాలు చేసింది.

 ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ షిప్ట్ అయిన ఈ అమ్మడు.. అక్కడ సైతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది. బాలీవుడ్ లో షారుఖ్ సరసన డుంకీ చిత్రంతో హిట్టుకొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హిందీలో అస్సీ అనే సినిమా చేసింది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె టాలీవుడ్ పై సౌత్ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

సౌత్ సినిమాల్లో ప్యాడెడ్ బ్రా వేసుకోమని చెప్తారని తాప్సీ పన్ను. షాకింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎంత అసౌకర్యంగా ఉంటాయో ఒక అమ్మాయిగా నాకు తెలుసు అని చెప్పుకొచ్చింది తాప్సీ. సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడూ చుట్టూ ఉండేవారు గమనిస్తూ ఉంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపింది. సాంగ్స్ సమయంలోనూ బాడీ పార్ట్స్ పై ఎందుకు ఫోకస్ పెడుతారో అర్ధం కావడం లేదు. బాలీవుడ్ లోనూ ఇది ఉంది.. కానీ సౌత్ లో ఎక్కువగా ఉంటుంది అని తాప్సీ సంచలన కామెంట్స్ చేసింది. దాంతో తాప్సీ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

Opens Up About an Embarrassing On-Set Experience

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us