70th Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్‌గా నివేదా థామస్
0వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. కేరళలోని కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల జరిగింది. 21న (శనివారం) రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఎంతో మంది స్టార్స్ పాల్గొన్నారు. తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం భాషల్లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందజేశారు.

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. కేరళలోని కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల జరిగింది. 21న (శనివారం) రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఎంతో మంది స్టార్స్ పాల్గొన్నారు. తెలుగు భాషల్లో ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ టెక్నీషయన్స్ కు అవార్డులు అందజేశారు. తెలుగు సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందించారు. సౌత్ ఇండస్ట్రీకి సంబందించిన స్టార్స్ ఈవేడుకలో పాల్గొన్నారు. కాగా పుష్ప 2 సినిమాకిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే 35: చిన్నకథ కాదు చిత్రానికిగానూ హీరోయిన్ నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. అలాగే అవార్డులను అందుకున్న మిగిలిన తెలుగు సినిమాలు ఏవో, అందుకుంది ఎవరో చూద్దాం..! ఆ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.
1. ఉత్తమ చిత్రం: పుష్ప 2
2. బెస్ట్ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2)
3. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
4. బెస్ట్ డెబ్యూ యాక్టర్ : సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
5. బెస్ట్ డెబ్యూ హీరోయిన్ : నయన్ సారిక (గం గం గణేశా)
6. బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: పుష్ప 2
7. ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
8. ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
9. ఉత్తమ సాహిత్యం: చుట్టమల్లె చుట్టేస్తోంది (దేవర), రచయిత: రామజోగయ్యశాస్త్రి
10. ఉత్తమ గాయకుడు: శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి: గుంటూరు కారం)
11. ఉత్తమ గాయని: శిల్పారావు (చుట్టమల్లె : దేవర)
12. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ- మోనిక (పుష్ప 2)
13. బెస్ట్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి)
14. ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్
15. ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా
16. ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




