Viral Video: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూశారంటే బెదురుకుంటారు మరీ

జంతువుల వీడియోలపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మరో వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన జనాలు ఒక్కసారిగా షాక్‌కు

Viral Video: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూశారంటే బెదురుకుంటారు మరీ
Cow
Follow us

|

Updated on: Jul 16, 2022 | 12:59 PM

Viral Video: ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలను మనం ఇంటర్నెట్ లో అనేకం చూస్తాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే… మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో మనల్ని కడుపుబ్బా నవ్వించే వీడియోలు చాలా ఉన్నాయి. కుక్కలు, పిల్లులు, కోళ్లకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం ఉన్నాయి. జంతువుల వీడియోలపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మరో ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన జనాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.

సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వీడియోలో పొలం మధ్యలో ఒక పక్షి నిలబడి ఉంది. అంతలోనే అటుగా ఓ ఆవుల మందా గడ్డి మేస్తూ వచ్చింది. ఆవులను చూసిన ఆ పక్షి ఏ మాత్రం భయపడకుండా అలాగే నిలబడి ఉంటుంది. పైగా పక్షిని బెదిరించాలని చూసిన ఆవులనే అది ఢీకొడుతూ బెదిరించసాగింది. ఆవులు ఒక్కొక్కటిగా పక్షిని బెదిరించే ప్రయత్నం చేసినా పక్షి ఏ మాత్రం బెదరకుండా వాటినే తరిమికొట్టింది. ఈ వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వీడ్ యానిమల్స్ ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే మూడున్నర లక్షల మందికి పైగా వీక్షించారు. 17000 మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. చాలా మంది ఈ వీడియోను రీట్వీట్ కూడా చేశారు. కొందరు వ్యక్తులు ఈ వీడియోపై రకాల కామెంట్స్‌ చేస్తున్న నెటిన్లు షేర్లు, లైకులు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి