Cattle Urine: రైతులకు గుడ్‌న్యూస్‌.. గోమూత్రం కొంటున్న ప్రభుత్వం.. లీటర్‌ ఖరీదు ఎంతంటే..

ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ మరో రెండు వారాల్లో ప్రారంభమవుతుంది. ముందుగా డిమాండ్ చేసే గౌతన్నలకే సేకరణ ప్రణాళికలో ప్రాధాన్యత ఇస్తారు. ఈ మేరకు కమిటీ ప్రతిపాదన చేసిందని, త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని,

Cattle Urine: రైతులకు గుడ్‌న్యూస్‌.. గోమూత్రం కొంటున్న ప్రభుత్వం.. లీటర్‌ ఖరీదు ఎంతంటే..
Cattle Urine
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 16, 2022 | 11:12 AM

Cattle Urine: రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తుంటాయి.. వ్యవసాయ రంగంలో కూడా మహిళలు ముందుకు రావడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఆవు పేడను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఇప్పుడు గోమూత్రాన్ని కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే గోధన్ న్యాయ్ యోజన పథకం ఉంది. ఈ పథకం కింద రైతుల నుంచి పశువుల పేడను సేకరిస్తున్నారు. ఐతే ఇప్పుడు గోమూత్రాన్ని కూడా సేకరించనున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని భూపేష్ బఘేల్ ప్రభుత్వం రైతులకు సహాయం చేయడానికి నిరంతరం ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఆవు మూత్రాన్ని లీటరుకు రూ.4 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం త్వరలో సన్నాహాలు చేసింది. త్వరలో సీఎం భూపేష్ బఘేల్‌కు ప్రతిపాదన పంపనున్నారు. సీఎం ముద్ర రాగానే పథకం అమలవుతుంది. ఈ వివరాలను అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి లీటరుకు 4 రూపాయల చొప్పున ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ మరో రెండు వారాల్లో ప్రారంభమవుతుంది. భూపేష్ సర్కార్ ఇప్పటికే రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తోంది. దీని కింద పేడ సేకరణకు ప్రణాళిక రూపొందించారు. ఫిబ్రవరి 2022 లో రాష్ట్ర ప్రభుత్వం ఆవు పేడ కొనుగోలు మొదలుపెట్టింది. తాజాగా ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని తరువాత మొత్తం పథకంపై సేకరణ, పరిశోధన పద్ధతిని నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఆవు మూత్రాన్ని లీటరుకు రూ.4 చొప్పున కొనుగోలు చేయాలని కమిటీ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సలహాదారు ప్రదీప్ శర్మ తెలిపారు. త్వరలోనే సీఎం నుంచి ఆమోదం తీసుకోనున్నారు. ‘విలేజ్ గౌతన్ సమితి’ ద్వారా గోమూత్రాన్ని సేకరించి, పశువుల పెంపకందారులకు పక్షం రోజులకు ఒకసారి చెల్లిస్తారు. ముందుగా డిమాండ్ చేసే గౌతన్నలకే సేకరణ ప్రణాళికలో ప్రాధాన్యత ఇస్తామని శర్మ తెలిపారు. ఈ మేరకు కమిటీ ప్రతిపాదన చేసిందని, త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..