AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giant Squid : ఓరి దేవుడో..! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై 8కాళ్ల వింతజీవి దాడి.. వీడియో చూస్తే వణుకే!

టైటానిక్ వంటి ప్రమాదాల నుండి షార్క్ దాడుల వరకు, మహాసముద్రాల గర్భంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి మానవులకు ఇంకా అనేక విషయాలు తెలియాల్సి ఉంది..

Giant Squid : ఓరి దేవుడో..! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై 8కాళ్ల వింతజీవి దాడి.. వీడియో చూస్తే వణుకే!
Giant Squid
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2022 | 10:40 AM

Share

Giant Squid Attacks: సముద్రం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. టైటానిక్ వంటి ప్రమాదాల నుండి షార్క్ దాడుల వరకు, మహాసముద్రాల గర్భంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి మానవులకు ఇంకా తెలియదు. సముద్రంలో ఇంక చాలా ప్రమాదకరమైన జీవులు కూడా కనిపిస్తాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జెయింట్ వేల్ మరియు షార్క్ వంటి జంతువులు కూడా సముద్రంలో నివసిస్తాయి. అయినప్పటికీ, మానవులు సముద్రంలోకి వెళ్ళడానికి భయపడరు. ఇప్పుడు ప్రజలు బీచ్‌లో ఆనందించడమే కాదు.. సర్ఫింగ్ చేస్తూ కూడా సముద్రాన్ని ఈదేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు సర్ఫింగ్ సమయంలో ప్రజలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. సముద్రంలో నివసించే జీవులు కూడా వారిపై దాడి చేస్తాయి. ఇది తరచుగా జరగకపోయినా, అప్పుడప్పుడు జరిగే ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా ప్రజలను షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి. అలాంటి ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై హఠాత్తుగా 8 కాళ్ల వింత జీవి దాడి చేస్తుంది.

వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు, సముద్రం లోతుల్లో ఈదుతున్న ఒక జీవి అకస్మాత్తుగా అతనిని చేరుకోవడం మీరు చూడవచ్చు. ఈ జీవి స్క్విడ్, ఇది ఆక్టోపస్ జాతి. స్క్విడ్ మొదట నీటి నుండి ఒక అడుగు తీసి సర్ఫింగ్ బోర్డుపై వేస్తుంది. దాని నుండి వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని సెకన్లలోనే అతనికి రెండు వైపుల నుండి సర్ఫింగ్ బోర్డుపై దాడి చేస్తుంది ఆ వింత జీవి.. దాంతో సర్ఫింగ్ చేస్తున్న ఆ వ్యక్తి ఇక చేసేది లేక నీళ్లలోకి దూకేశాడు. ఆ తర్వాత ఆ వింత జీవి వెళ్లిపోయిందని భావించి తిరిగి బోర్డ్‌పైకి ఎక్కుతాడు..కానీ, అది అక్కడే ఉంటుంది. అది దాని మరో మూడు కాళ్తతో బోర్డ్‌ను అట్టిపట్టుకుని ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ జీవి సర్ఫింగ్ బోర్డును ఆసరాగా చేసుకుని దాని కాళ్లను విప్పుతూ నీళ్లో ఎంజాయ్‌ చేస్తున్నట్టుగా ఉండిపోయింది. వాస్తవానికి ఆ జీవి ఆక్టోపస్ అని తెలిసింది. ఎనిమిది కాళ్ల జీవి. ఇది చూడటానికి చాలా వింతగా ఉంటుంది. ఈ 8 కాళ్ల జీవి మనిషికి ఎలాంటి హాని కలిగించకపోవడం విశేషం.

యూట్యూబ్‌లో జేమ్స్ టేలర్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియో 2017 సంవత్సరానికి చెందినది అయినప్పటికీ, ప్రజలు ఇప్పటికీ ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఒక వినియోగదారుపై వ్యాఖ్యానిస్తూ, ‘స్క్విడ్ ఆ వ్యక్తిపై దాడి చేయడం లేదు, కానీ అతను చావు భయంతో వణికిపోతున్నాడు. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి