Parliament Monsoon Session 2022: డిజిటల్ మీడియాపై కేంద్రం ఫోకస్.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే..

Parliament Monsoon Session 2022: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక బిల్లులను..

Parliament Monsoon Session 2022: డిజిటల్ మీడియాపై కేంద్రం ఫోకస్.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే..
Parliament
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 18, 2022 | 2:59 PM

Parliament Monsoon Session 2022: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక బిల్లులను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 32 బిల్లులను ప్రతిపాదించగా.. 14 బిల్లులకు రూట్ క్లియర్ అయ్యింది. అన్నికంటే ముఖ్యంగా.. ఈ సమావేశంలో డిజిటల్ మీడియా నియంత్రణకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

‘‘ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లు 2022’’ పేరుతో పార్లమెంటు ముందుకు మీడియాను నియంత్రించే బిల్లు తీసుకురానున్నారు. ఇప్పటికే ఉన్న ‘‘ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం 1867’’ ను తొలగిస్తూ కొత్త చట్టాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. డిజిటల్ న్యూస్ పోర్టళ్లను వార్తాపత్రికల తరహాలో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు కల్పించనుంది ఈ బిల్లు. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిజిటల్ న్యూస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం నాడు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఉభయ సభల్లో ప్రజెంటేసన్ కోసం 32 బిల్లుల ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ 32 బిల్లుల్లో 14 సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జులై 18న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

ఇక 2022 వర్షాకాల సెషన్‌లో 18 సిట్టింగ్‌లు ఉంటాయి. మొత్తం 108 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. 108 గంటల్లో దాదాపు 62 గంటలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినవి. మిగిలిన సమయం ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ సభ్యుల బిజినెస్ కోసం కేటాయించడం జరిగింది. పార్లమెంట్ గత సమావేశాల మాదిరిగానే, ఈ సెషన్‌లోనై కోవిడ్ 19 ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..