Frog Marriage: కప్పలకు పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. దీని వెనుక కథ తెలిస్తే షాక్ అవుతారు..!

Frog Marriage: వర్షాలు రాకపోవపోతే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతారో.. భారీ వర్షాల కారణంగా కూడా అంతే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Frog Marriage: కప్పలకు పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. దీని వెనుక కథ తెలిస్తే షాక్ అవుతారు..!
Frogs
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 16, 2022 | 4:05 PM

Frog Marriage: వర్షాలు రాకపోవపోతే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతారో.. భారీ వర్షాల కారణంగా కూడా అంతే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, చాలా సందర్భా్ల్లో వర్షాల కోసం కప్పలకు, గాడుదలకు పెళ్లిళ్లు చేయడం వంటి సీన్లను చూసే ఉంటారు. రైతులు, గ్రామీన ప్రాంతాల ప్రజలు వర్షాలు పడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కప్పలకు వివాహం చేస్తుంటారు. అనంతరం ఆ కప్పలను చెరువులో గానీ, నీటి కుంటల్లో గానీ వదులుతుంటారు. అలా చేయడం ద్వారా వర్షాలు పడుతాయని విశ్వాసం. అయితే, ఇప్పటి వరకు కప్పలకు పెళ్లిళ్లు చేయడం మాత్రమే తెలుసు.. మరి కప్పలకు విడాకులు కూడా ఇస్తారని తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. కప్పలకు విడాకులు ఇస్తారు. ఈ ఆసక్తికరమైన విడాకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వివాహం ఎలా జరుగుతుంది? వర్షం కోసం చేసే రెండు కప్పల పెళ్లికి.. మనుషుల పెళ్లికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఒక వ్యక్తి వివాహంతో పాటు ఈ వివాహంలోనూ అనేక రకాల ఆచారాలు పాటిస్తారు. కప్పలకు పూలమాల వేస్తారు, మంత్రాలు జపిస్తారు. సాధారణ పెళ్లిళ్ల మాదిరిగానే పెళ్లిళ్ల అలంకరణలు కూడా చేసి డ్యాన్స్ , పాటలు పాడుతూ అతిథులకు విందు ఏర్పాటు చేస్తారు. అలా ఘనంగా వివాహం జరిపిస్తారు.

పెళ్లి తర్వాత ఏం జరుగుతుంది? సంప్రదాయం ప్రకారం కప్పల జంటకు వివాహం చేసిన తరువాత వాటిని నదిలో, చెరువులో వదులుతారు. ఆ తరువాత వివాహాన్ని సంపూర్ణంగా పరిగణిస్తారు. ఇలా చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయని విశ్వాసం. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. పెళ్లి తరువాత విడాకులు కూడా ఇస్తారు.

విడాకులు ఎందుకు? పెళ్లి తర్వాత విడాకులు తీసుకునే సంప్రదాయం కూడా ఉంది. వర్షాలు కురవడానికి కప్పలకు పెళ్లి చేస్తే.. ఆ భారీ వర్షాలు ఆగడానికి విడాకులు ఇస్తారు. ఈ సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఉంది. ఇలా వర్షాల కోసం పెళ్లి, వర్షాలు ఆగడానికి విడాకులు ఇచ్చి.. పెళ్లి తంతును సమాప్తం చేస్తారన్నమాట.

విడాకులు ఎలా ఇస్తారు..? కప్పలకు విడాకులు తీసుకోవడానికి.. మొదట రెండు కప్పలను పట్టుకుంటారు. ఒక కార్యక్రమం తరువాత వాటిని ప్రత్యేక చెరువులలోకి వదులుతారు. ఈ విధంగా వాటికి విడాకులు ఇస్తారు. ఇలా చేస్తే భారీ వర్షాలు ఆగిపోతాయని విశ్వాసం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..