Kohli vs Bairstow: మొన్న బద్ద శత్రువులు.. నేడు మిత్రులైన ఇద్దరు దిగ్గజాలు.. ప్రాక్టీస్ సెషన్‌లో అరుదైన సీన్..

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ సందర్భంగా, భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్‌కు ప్లేయర్ జానీ బెయిర్‌స్టో మధ్య హీట్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ చర్చలో అంపైర్ జోక్యం చేసుకున్నాడు.

Kohli vs Bairstow: మొన్న బద్ద శత్రువులు.. నేడు మిత్రులైన ఇద్దరు దిగ్గజాలు.. ప్రాక్టీస్ సెషన్‌లో అరుదైన సీన్..
Ind Vs Eng 2022 Virat Kohli And Jonny Bairstow
Follow us
Venkata Chari

|

Updated on: Jul 16, 2022 | 4:07 PM

IND vs ENG 2022: భారత ఆటగాడు విరాట్ కోహ్లీ తన దూకుడు శైలికి ప్రసిద్ధి చెందాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్‌కు ప్లేయర్ జానీ బెయిర్‌స్టో మైదానంలో తలపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగినా.. లార్డ్స్ వన్డేకు ముందు భిన్నమైన దృశ్యం కనిపించింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మైదానంలో చాలా సేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఫీల్డ్‌లో ఉన్న అభిమానులకు ఆ దృశ్యం బాగా నచ్చింది. దీంతో ఈ వీడియోను నెట్టింట్లో పంచుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన చివరి టెస్టులో జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ మైదానంలో కామెంట్ చేశాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో కూడా స్పందించాడు. దీంతో ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా రావడంతో, అంపైర్ జోక్యం చేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జానీ బెయిర్‌స్టో మాట్లాడుతూ, ఇది పెద్ద విషయం కాదని, మైదానంలో పరిస్థితి వేరేలా ఉంటుందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

‘మా మధ్య పరస్పర అవగాహన చాలా బాగుంది’

గత 10 ఏళ్లుగా నేను, విరాట్ కలుస్తూనే ఉన్నామని జానీ బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. మా మధ్య పరస్పర అవగాహన చాలా బాగుంది. అదే సమయంలో, క్రికెట్ మైదానంలో గెలవడానికి బరిలోకి దిగుతామని, కాబట్టి కొన్ని సార్లు విషయాలు కంట్రోల్ చేసుకోవడం కష్టమని, ఇది పెద్ద విషయం కాదని తెలిపాడు. విశేషమేమిటంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం 3 మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమంగా నిలిచాయి. దీంతో రేపు జరిగే మ్యాచ్‌పైనే ఇరుజట్లు ఫోకస్ చేసి, సిరీస్ గెలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..