World Snakes Day: వరల్డ్ స్నేక్స్ డే స్పెషల్.. పాములపై నమ్మలేని నిజాలు మీకోసం..

World Snakes Day: పాము పేరు వింటే చాలా మంది హడలిపోతారు. ఎందుకంటే అవి కాటేస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే.

World Snakes Day: వరల్డ్ స్నేక్స్ డే స్పెషల్.. పాములపై నమ్మలేని నిజాలు మీకోసం..
Snake Day
Follow us

|

Updated on: Jul 16, 2022 | 7:39 PM

World Snakes Day: పాము పేరు వింటే చాలా మంది హడలిపోతారు. ఎందుకంటే అవి కాటేస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. అదే సమయంలో మరికొందరు పాములను ప్రేమిస్తారు. అయితే, ఈ భూమిపై మనుషులు ఎలా జీవిస్తున్నారో.. మనుషులతో పాటు, అనేక జంతువులతో పాటు పాములు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగానే అనేక మానవ జాతులు ఉన్నట్లుగానే.. పాముల్లోనూ అనేక జాతులు ఉన్నాయి. వెలుగులోకి వచ్చిన కొన్ని మాత్రమే కాగా, వెలుగులోకి రాని మరెన్నో పాముల జాతులు భూమిపై ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే.. మదర్స్ డే, ఫాదర్స్ డే, వాటర్ డే, ఎర్త్ డే మాదిరిగానే.. పాముల డే కూడా పెట్టారు. జులై 16ను వరల్డ్ స్నేక్స్ డే గా జరుపుతారు. ఈ స్నేక్స్ డే సందర్భంగా పాములకు సంబంధించిన నమ్మలేని వాస్తవాలను, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పాముల గురించి అనేక అపోహలు- నిజాలు..

పాములకు చెవులుంటాయా?

ఇవి కూడా చదవండి

అతి చిన్న శబ్దాలును సైతం వినగలిగే వినికిడి శక్తి కలిగివున్న వారివి పాము చెవులు అని కామెంట్ చేస్తుంటారు. నిజానికి పాముకు బయటకు కన్పించేలా చెవులుండవు. పాముకి బాహ్య చెవి ఉండదు. కానీ కర్ణభేరీ రంధ్రం ఉంటుంది. ఇది మధ్య చెవి నుంచి లోపలికి వెళుతుంది. మధ్య చెవిలో ‘కాలుమెల్లా ఆరిస్‌’ అనే ఒక సున్నితమైన ఎముక ఉంటుంది. ఇది ఒకవైపు లోపలి చెవికి కలిపి ఉండగా, మరో వైపు దాని దవడ కింద చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడంతో నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలను ఈ కర్ణస్తంభిక ఎముక నిర్మాణం గ్రహించి చెవికి చేరుతాయి. ఫలితంగా పాము నేలలో వచ్చే ధ్వని తరంగాలను మాత్రమే గ్రహిస్తాయి.

నాగ స్వరాని నాట్యం చేస్తాయా?

నిజానికి పాములు గాలిలో శబ్ద తరంగాలను గ్రహించలేవు. నాగస్వరం నుంచి వచ్చే శబ్దానికి పాములు స్పందించవు. అయితే సినిమాల్లో, ఇతర ప్రదర్శనలో నాగస్వరం ఊదుతారు. పాము కళ్లముందు నాగస్వరం ఊదే బూరను కదుపుతుంటారు. కాబట్టి పాము అటు ఇటూ కదులుతుంటుంది. మరోవైపు నేలను తడుతూ ఉంటే ఆ శబ్ద తరంగాలకనుగుణంగా పాములు కదులుతుంటాయి.

పాములు వాసన చూస్తాయా?

రెండుగా చీలిన నాలుక ద్వారానే ఆహారం ఉన్న దిశను, వాసనను పాములు గుర్తిస్తాయి. రెండు రంగుల్ని మాత్రమే చూసే శక్తి పాములుకుంటుంది. పాములు రెప్ప వేయవు. ఎందుకంటే వాటికి కనురెప్పలుండవు. పాములకు తల భాగంలో ఇన్‌ఫ్రా రెడ్ సెన్సిటివ్ రిసెప్టర్లు ఉంటాయి. ఈ రిసెప్టర్ల సాయంతోనే అవి ఎలుకలు, ఇతర చిన్న చిన్న కీటకాలను గుర్తించి వేటాడతాయి.

పాములు పగబడతాయా?

పాములు పగబడతాయని చాలామంది నమ్ముతుంటారు. చాలా సినిమాలు ఈ అంశం ఆదారంగా తెరకెక్కాయిక. నిజానికి పాములకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేయడం ఉండదు. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తు పెట్టుకుంటాయి. కానీ దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకోవు. ఒక వ్యక్తిపై పాములు పలు మార్లు దాడి చేసి కాటువేయడం యాధృచ్ఛికమే కావచ్చని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవు. తమకు ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగిస్తే అవి ప్రాణ రక్షణ కోసం కాటు వేస్తాయి.

ఆహారం ఎలా తీసుకుంటాయి?

పాములు తమ ఆహారాన్ని నమలలేవు. నేరుగా మింగేస్తాయి. తమ తలకంటే పెద్ద పరిమాణం ఉన్న జంతువుల్ని కూడా మింగేయగలవు. పాములు పాలు తాగవు. వాటి నోటి నిర్మాణం పాలు తాగేందుకు అనువుగా ఉండదు.

పాము-ముంగిస వైరం?

పాము, ముంగిసలు జన్మత: శత్రువులు కావు. ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఆత్మరక్షణార్థం అవి ఒకదానితో ఒకటి తలపడతాయి.

పాములు లేని దేశాలు..

ఐర్లాండ్, ఐస్‌ల్యాండ్, న్యూజీలాండ్ దీవుల్లో పాములు కనిపించవు. అలాగే, అంటార్కిటికా ఖండంలో, హిమాలయాల్లో కూడా పాములు కనిపించవు.

నీటిలో పాముల మనుగడ..

కొన్ని పాములు నీటి అడుగున నివసిస్తాయి. ఇవి తమ చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి.

పాములను తినేవారున్నారు..

చైనా సహా కొన్ని ఆసియా దేశాల్లో పాములను తింటుంటారు. పాము రక్తాన్ని లిక్కర్లో కలుపుకుని తాగుతారు. కొన్ని దేశాల్లో రోజుల వయసున్న పాముల్ని తెచ్చి పెంచుకుంటారు.

పాము విషంతో ఔషధం తయారీ..

యాంటీవీనమ్ వంటి ఔషధం పాము విషం నుంచే తయారు చేస్తారు. పెయిన్స్, క్యాన్సర్, ఆర్థరైటీస్, స్ట్రోక్స్, హార్ట్ డిసీజ్, హిమోఫిలియా, హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్య చికిత్సకుపయోగించే ఔషధాలు తయారుచేస్తారు. శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం జరగకుండా నిరోధించడానికి అవసరమైన ఔషధాల్ని కూడా పాము విషంతో తయారుచేస్తారు.

పాము కాటువేస్తే ఏం జరుగుతుంది?

పాము కాట్ల వల్ల మరణాలతో పాటు, అంధత్వం, అవయవాలను తొలగించడం జరుగుతోంది. గ్రామాల్లో నాటు చికిత్స కారణంగా మృతులు, అంగవైకల్యం కలగటం జరుగుతోంది. యాంటీవీనం ఔషధం అందుబాటులో ఉండకపోవడం కూడా కారణమే. పాము కాటు వల్ల జరిగే నష్టాలను నివారించడానికి సాధ్యమైనంత వేగంగా యాంటీవీనమ్ ఇవ్వాలి.

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

విష సర్పం బారిన పడితే 5-15 నిమిషాల్లో విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక గంట నుంచీ 3 గంటలలోపు శరీరంలోని మిగిలిన భాగాలన్నిటికీ విషం చేరుతుంది. ఇది మనిషి నాడీ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. చాతిలో విపరీతమైన నొప్పి రావటంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి. పాము కరిచిన వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. పాము కరిచిన ప్రదేశానికి కొద్దిగా పైభాగానికి గట్టిగా (రక్త ప్రసరణ జరగకుండా) కట్టుకట్టాలి. పాము కరిచిన భాగము నుండి సూదిలేని సిరంజితో, లేదా నోటితో విషాన్ని బయటకు తీయాలి. నిజానికి పాము కోరల్లో ఉండే విషం 0.5 ఎంఎల్‌ నుంచీ 2 ఎంఎల్‌ మాత్రమే ఉంటుంది. పాము కాటు వేస్తే వెంటనే డాక్టరు దగ్గరకు తీసుకొని వెళితే ఇంజక్షను చేసి ప్రాణాలు కాపాడవచ్చు. మంత్రాలు వేయించడం, తాయెత్తులు కట్టించడం లాంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోరాదు. పాములుండే ప్రదేశాల్లో సంచరించేవారు హోమియోపతి మెడిసిన్‌ అయిన NAJA-200 బాటిల్‌ దగ్గర ఉంచుకుంటే మంచిది. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి మూడు సార్లు వేస్తే విష ప్రభావం తగ్గుతుంది. ఈ లోపు డాక్టరు దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవచ్చు. పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయటం చేయకూడు.

చనిపోయిన పాములు కాటువేస్తుందా?

చనిపోయిన పాములతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పామును చంపేసిన కొంతసేపటి వరకూ దాని నాడీ మండలం క్రియాశీలంగానే ఉండొచ్చు. దానివల్ల అది కాటు వేయవచ్చు. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.

అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలు..

భూమి మీద సంచరించే పాములన్నింటిలోకీ, ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌లాండ్ తాయ్‌పాన్ పాము అత్యంత విషపూరితమైనది. ఒక్క కాటుతో వంది మందిని చంపగలిగేంత విషపూరితమైనది ఈ పాము అయితే ఈ జాతి పాము కాట్ల వల్ల మనుషులు చనిపోయిన దాఖలాలు ఇంతవరకూ లేవు. బ్లాక్ మాంబా, కోస్టల్ తైపాన్‌ (ఆస్ట్రేలియా) పాముల నుంచి మనుషులకు ఎక్కువ ప్రమాదం ఉంది. ఒకే జాతి కుటుంబానికి చెందనవి ఈ రెండు పాములు. ఇతర పాముల విషాలకన్నా వేగంగా వీటి విషం ప్రభావం చూపుతుంది. ఈ పాములు కాటువేసినపుడు తక్షణమే చికిత్స అందించకపోతే అర గంటలోనే మరణం సంభవిస్తుంది. ప్రపంచంలో సంభవిస్తున్న పాముకాటుకు గురువుతున్న సంఖ్యలో సగం భారతదేశంలో సంభవిస్తున్నవి. భారతదేశంలో మనుషుల మరణాలకు అత్యధికంగా కారణమయ్యే నాలుగు రకాల పాముల్లో పింజరి ఒకటి.

రక్త పింజర (రసెల్స్ వైపర్):

ఇది మామూలుగా దూకుడు స్వభావమున్న పాము. ఇండియా, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద తరచుగా కనిపిస్తుంటుంది. ఈ పాము కాటు వల్ల అంతర్గత రక్త స్రావం ఎక్కువై ప్రాణాపాయం సంభవిస్తుంది.

కట్ల పాము (ఇండియన్ క్రెయిట్):

పగటిపూట బెరుకుగా కనిపించే ఈ పాము.. రాత్రిపూట చాలా దూకుడుగా దాడి చేస్తుంది. ఇది 1.75 మీటర్ల (5 అడుగుల 9 అంగుళాల) వరకూ పొడవు ఉంటుంది.

నాగు పాము / తాచు పాము (ఇండియన్ కోబ్రా):

నాగు పాము భారత ఉపఖండమంతటా కనిపిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. చీకట్లో ఇది ఎక్కువగా దాడి చేస్తుంది. అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.

కింగ్ కోబ్రా/రాచనాగు/కాళింద సర్పం: 

ఇది పాముల అన్నింట్లోనూ అత్యంత పొడవుగా పెరుగుతుంది. ఇది దాదాపు 20 అడుగులు పెరుగుతుంది. ప్రపంచంలో విషపూరితమైన పాముల్లో, ఒక్క కాటులో ఎక్కువ పరిణామంలో విషాన్ని చిమ్మేది కూడా ఈ పామే. ఇది ఒక్కసారి కాటు వేసేటప్పుడే 10 నుంచి 20 మిల్లీ లీటర్ల విషాన్ని చిమ్ముతుంది. దీని విషం నాడీ వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది.

పాములు లేకుంటే..

పాములు అంతరించిపోతే జీవసమతుల్యం దెబ్బతింటుంది. ఇప్పటికే చాలా దేశాల్లో పాముల్ని ఆహారం కోసం, వాణిజ్య అవసరాల కోసం వేటాడుతున్నారు. పాముల చర్మంతో తయారు చేసే వస్తువులకు చాలా గిరాకీ ఉంది. దక్షిణ భారత దేశంలో ఇలారు అనే జాతికి చెందిన వారు ఎక్కువగా పాముల్ని పట్టి వాటి చర్మాలను అమ్ముతుంటారు.

పాముల విషంతో వ్యాపారం..

యాంటీ వీనం ఔషధ తయారీ సంస్థలు పాముల విషాలను సేకరిస్తుంటాయి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా యాంటీవీనం మార్కెట్ విలువ 969.38 మిలియన్ డాలర్లు. 2026 నాటికి యాంటివీనం మార్కెట్ విలువ 1585.01 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.

పాము కాటుతో మరణాలు..

భారతదేశంలో పాము కాటు వల్ల గత 20 ఏళ్లలో 12 లక్షల మంది మృతి చెందారు. భారతదేశంలో ప్రతి ఏటా పాము కాటుకి గురవుతున్నవారు దాదాపు 2 లక్షల మంది, చనిపోతున్నవారు 30-40 వేల వరకూ ఉన్నారు. మన దేశంలో 250-300 వరకూ వివిధ రకాల పాముల జాతులు ఉండగా, వాటిలో 52 మాత్రం విషపూరితమైనవి. పాము కరచిన తర్వాత విషంతో చనిపోతున్నవారికంటే, భయంతో చనిపోతున్నావరే ఎక్కువట. వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది పాము కాట్లకు గురవుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 81వేల నుంచి 1.38లక్షల మంది పాము కాటుతో మృతి చెందుతున్నారు. మరోవైపు పాముకాటుకు గురై కోలుకుంటున్నప్పటికీ.. శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు చాలామంది బాధితులు. ఎక్కువ మంది మరణాలకు రక్త పింజరి, కట్ల పాములు, తాచు పాములు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. మరో 12 జాతుల పాములు కూడా మరణాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. పాముకాటుకు గురైనవారికి సరైన సమయంలో వైద్య సదుపాయాలు అందకనే మరణాలు సంభవిస్తున్నాయి. జూన్ – సెప్టెంబర్ నెలల మధ్య వర్షాకాలంలోనే ఎక్కువ పాము కాటు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ 250 మందిలో సగటున ఒకరు 70 ఏళ్ల వయసుకన్నా ముందు పాము కాటు వల్ల చనిపోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సగటున వందమందిలో ఒకరు పాముకాటుతో చనిపోయే ప్రమాదం ఉందని వెల్లడైంది. 2001-2014 మధ్య పాము కాటు మరణాల్లో 70 శాతం వరకూ ఎనిమిది రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి. ఈ జాబితాలో బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..
సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..