Skin Care: స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేయండి..!

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jul 15, 2022 | 8:20 PM

Skin Care: అలర్జీ అనేది చర్మంపై సాధారణ సమస్య కావచ్చు, కానీ అది పెరిగితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోజువారీ పనులు చేయడంలో..

Skin Care: స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేయండి..!
Skincare

Skin Care: అలర్జీ అనేది చర్మంపై సాధారణ సమస్య కావచ్చు, కానీ అది పెరిగితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోజువారీ పనులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరికి తినే ఆహారం వల్ల చర్మంపై ఎలర్జీ వస్తే.. మరికొందరికి బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. అలెర్జీలలో చర్మంపై దద్దుర్లు, దురదలు ఉండటం సాధారణం. దీనికి చికిత్స చేయకపోతే చర్మంపై నల్ల మచ్చలు కూడా ఏర్పడతాయి. అయితే.. స్కిన్ అలర్జీకి, ఫుడ్ ఎలర్జీకి మధ్య చాలా తేడా ఉంటుంది. స్కిన్ అలర్జీకి వైద్య చికిత్స పొందడంతో పాటు.. హోమ్ రెమెడీస్ కూడా పాటించడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. నిపుణులు తెలిపిన ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ ట్రీ ఆయిల్.. ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంపై లోపలి నుండి అలెర్జీని రిపేర్ చేస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ అలెర్జీల నుండి బయటపడటానికి సహాయపడుతాయి. చర్మంపై మరకలు, దద్దుర్ల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ నూనెను రోజుకు రెండుసార్లు అప్లై చేయాలి. మార్కెట్లో ఈ నూనె ఈజీగా లభిస్తుంది. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

వెనిగర్.. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో చర్మ అలెర్జీని తొలగించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మ సంరక్షణ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇది ఒక రకమైన యాసిడ్ కలిగి ఉంటుంది. ఇది చర్మంపై దద్దుర్లు, ఎరుపును తొలగిస్తుంది. స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా వెనిగర్ వేయడం ద్వారా అలెర్జీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొబ్బరి నూనే.. చర్మం, జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనె దివ్యౌషధంగా పని చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మ సమస్యలను సులభంగా తొలగిస్తుంది. అంతే కాకుండా ఇందులోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా మార్చేందుకు పని చేస్తాయి. ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు చర్మానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu