AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon: మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు..! ఈ సింపుల్ టిప్స్‌తో ఇట్టే పట్టేయచ్చు..!

Identify Adulterated Watermelon: ప్రస్తుతం కల్తీ సమస్య ఆహార పదార్థాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది. కొందరు వ్యాపారులు పుచ్చకాయలను త్వరగా పండేలా చేయడానికి, లోపలి భాగం ఎర్రగా కనిపించేలా చేయడానికి ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కల్తీ చేసిన పుచ్చకాయలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుచ్చకాయను కొనేటప్పుడు అది సహజమైనదా? లేక కల్తీదా? అనేది ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Watermelon: మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు..! ఈ సింపుల్ టిప్స్‌తో ఇట్టే పట్టేయచ్చు..!
Watermelon
Rajashekher G
|

Updated on: Mar 06, 2026 | 9:12 PM

Share

ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండేట్లే ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ నెల రాకముందే పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటి చల్లని పానీయాలతో పాటు శరీరానికి చలువ చేసే పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. వేడి నుంచి ఉపశమనం కలిగించే అలాంటి పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు పీచు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ A, విటమిన్ C వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పండును ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం కల్తీ సమస్య ఆహార పదార్థాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది. కొందరు వ్యాపారులు పుచ్చకాయలను త్వరగా పండేలా చేయడానికి, లోపలి భాగం ఎర్రగా కనిపించేలా చేయడానికి ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కల్తీ చేసిన పుచ్చకాయలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పుచ్చకాయను కొనేటప్పుడు అది సహజమైనదా? లేక కల్తీదా? అన్నది గుర్తించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని సులభమైన సూచనలు చేసింది.

పుచ్చకాయ కల్తీని గుర్తించే సింపుల్ టెస్ట్:

  • మార్కెట్‌లో పుచ్చకాయ కొనేటప్పుడు ముందుగా చిన్న ముక్క కట్ చేసి ఇవ్వమని అడగాలి. ఆ తర్వాత ఒక చిన్న కాటన్ బాల్ లేదా టిష్యూ పేపర్ తీసుకుని ఆ ముక్క లోపలి భాగాన్ని స్వల్పంగా రబ్ చేయాలి.
  • రబ్ చేసిన తర్వాత కాటన్ లేదా టిష్యూ పేపర్ ఎరుపు రంగులోకి మారితే, ఆ పుచ్చకాయ కల్తీ చేసినదిగా భావించాలి.
  • ఎందుకంటే అలాంటి సందర్భాల్లో పుచ్చకాయలో “ఎరిథ్రోసిన్” అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేసి ఎర్రగా కనిపించేలా చేస్తారు.
  • ఈ రసాయనం కలిగిన పుచ్చకాయలు తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
  • అదే సమయంలో టిష్యూ పేపర్ రంగు మారకపోతే, ఆ పుచ్చకాయ సహజమైనదిగా భావించవచ్చు.

కార్బైడ్ వాడకంపై జాగ్రత్త:

మామిడిపండ్ల మాదిరిగానే పుచ్చకాయలను కూడా త్వరగా పండించడానికి కొంతమంది వ్యాపారులు కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ రసాయనం వాడిన పుచ్చకాయల పైభాగంలో కొన్నిచోట్ల పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పుచ్చకాయపై పసుపు మచ్చలు కనిపిస్తే, తినే ముందు ఉప్పు నీటితో బాగా కడిగి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం:

పుచ్చకాయను కొనుగోలు చేసే ముందు దాని పైభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ కాయపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తే, అలాంటి పుచ్చకాయలను కొనకపోవడం మంచిది. ఎందుకంటే ఆ రంధ్రాలు ఇంజెక్షన్ ఇచ్చిన గుర్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వేసవిలో పుచ్చకాయ తినేటప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!