AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఎన్ని కోట్లో తెలుసా?

భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన నటీమణుల జాబితాలో నయనతార పేరు కూడా ఉంటుంది. రోజురోజుకూ ఆమె పాపులారిటీతో పాటు సంపద కూడా పెరుగుతోంది. తాజాగా నయనతార మరో లగ్జరీ ఇల్లు కొనుక్కుంది. అది కూడా చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన పోయిస్ గార్డెన్ ప్రాంతంలో..

Nayanthara: పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఎన్ని కోట్లో తెలుసా?
Actress Nayanthara
Basha Shek
|

Updated on: Mar 07, 2026 | 6:27 AM

Share

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార మరో లగ్జరీ విల్లా కొనుగోలు చేసింది. తమిళనాడులోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతాలలో ఒకటైన చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఒక భారీ లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ఆమె కొనుగోలు చేసింది . దీని మొత్తం విలువ దాదాపు రూ. 31.5 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ప్రాపర్టీ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ జాప్కీ ద్వారా అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం, ఈ ఇల్లు చెన్నైలోని తేనాంపేట ప్రాంతంలో ‘లెగసీ’ అనే ప్రీమియం నివాస సముదాయంలో ఉంది. ఈ డ్యూప్లెక్స్ ఇల్లు ఒక అపార్ట్‌మెంట్ భవనంలోని 4, 5వ అంతస్తుల్లో ఉంది. దాదాపు 14,369 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. ఈ లగ్జరీ విల్లాలో విశాలమైన పార్కింగ్ స్థలం కూడా ఉంది. దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత సంవత్సరం డిసెంబర్‌లోనే పూర్తయింది. నయనతారకు ఇప్పటికే హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో రెండు లగ్జరీ విల్లాలు ఉన్నాయి. వాటి విలువ ఒక్కొక్కటి రూ. 15 కోట్లు. అంతేకాకుండా, కేరళలోని ఆమె పూర్వీకుల ఇల్లు రాష్ట్రంలోని అత్యంత విలాసవంతమైన విల్లాగా గుర్తింపు ఉంది.

నయనతార చివరిసారిగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో కనిపించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో కనిపించారు. దీన తర్వాత ఆమె టాక్సిక్ లో నటించింది. ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ నిర్మించిన ఈ పాన్-ఇండియా చిత్రంలో యష్ హీరోగా నటించాడు. నయనతార మెయిల్ లీడ్ రోల్ లో నటించింది. మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది.

నయనతార చాలా సంవత్సరాలుగా సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ యాక్ట్ చేస్తోందీ లేడీ సూపర్ స్టార్. కొత్త నేటికీ ఆమె క్రేజ్, డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. షారుఖ్ ఖాన్ సరసన ఆమె నటించిన జవాన్ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్