AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Foods: అధిక బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Weight Loss Tips: అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది జిమ్‌లకు పరుగెడుతుంటారు. వర్కవుట్లు, వ్యాయామాలు అంటూ శరీరాన్ని బాగా కష్టపెడుతుంటారు. మరికొందరు కఠినమైన డైటింగ్‌ నియమాలు పాటిస్తుంటారు.

Weight Loss Foods: అధిక బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..
Weight Loss Tips
Basha Shek
|

Updated on: Jul 15, 2022 | 8:01 PM

Share

Weight Loss Tips: అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది జిమ్‌లకు పరుగెడుతుంటారు. వర్కవుట్లు, వ్యాయామాలు అంటూ శరీరాన్ని బాగా కష్టపెడుతుంటారు. మరికొందరు కఠినమైన డైటింగ్‌ నియమాలు పాటిస్తుంటారు. ఇంకొందరైతే ఎక్కడ బరువు పెరుగుతామేమోనిని పూర్తిగా నోరు కట్టుసుకుంటుంటారు. దీని వల్ల బరువు తగ్గడం సంగతి పక్కనుంచితే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే రోజూ తినే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకుంటే శరీరంలో అధిక కొవ్వును కరిగించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ సూపర్‌ ఫుడ్స్‌ ఏంటో ఒకసారి తెలుసుకుందాం రండి.

జున్ను

బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో కాటేజ్ చీజ్ తప్పనిసరిగా చేర్చుకోవాలి. పనీర్ తినడం ద్వారా, శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. అంతేకాదు చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. ఆహార కోరికలు కూడా అదుపులో ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి

రాగులు

బరువు తగ్గాలనుకునే వారు రాగులను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. రాగుల్లో ఫైబర్ మాత్రమే కాదు, ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి రాగుల పిండిని ఉపయోగించవచ్చు. ఈ పిండితో ఇడ్లీ, దోసెలు మొదలైనవి చేసుకుని తినవచ్చు. ఇది కాకుండా రాగి ఖిచ్డీని కూడా ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. అదేవిధంగా రాగుల పిండిని సాధారణ పిండితో కలిపి రోటీలు కూడా తయారు చేసుకోవచ్చు.

గుడ్డు

గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది తిన్న తర్వాత చాలా సమయం వరకు ఆకలి బాధించదు. అంతేకాదు గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఉదయం అల్పాహారంలో కచ్చితంగా గుడ్డును చేర్చుకోవాలి.

మూంగ్‌దాల్‌

మూంగ్ దాల్‌ లేదా పెసర పప్పు తేలికగా జీర్ణమవుతుంది. పైగా ఇందులో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో అదనపు కొవ్వును అదుపులో ఉంచుతాయి. ఇందుకోసం మామూలుగా వండిన మూంగ్ దాల్‌ తీసుకోవచ్చు లేదా మూంగ్ దాల్ ఖిచ్డీని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి కాకుండా, మీరు మొత్తం మూంగ్‌దాల్‌ మొలకలను సిద్ధం చేసుకుని ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. ఒక కప్పు మొలకెత్తిన మూంగ్ దాల్‌లో దాదాపు 26 క్యాలరీలు ఉంటాయి.

పండ్లు

బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో కచ్చితంగా జ్యూసీ పండ్లను చేర్చుకోండి. ఆరెంజ్, సీజనల్, లిచీ, చెర్రీ, యాపిల్ మొదలైన వాటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ పండ్లు బరువును నియంత్రించడంలో బాగా సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు