Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆస్తమా ఔషధాలను మధ్యలోనే వదిలేశారా? అయితే షాకింగ్ విషయాలు మీకోసమే..!.

Health Tips: ఊపిరితిత్తులలో అనేక రకాల సమస్యలు వస్తాయి. వీటిలో ఆస్తమా వ్యాధి కూడా ఒకటి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ కేసులు..

Health Tips: ఆస్తమా ఔషధాలను మధ్యలోనే వదిలేశారా? అయితే షాకింగ్ విషయాలు మీకోసమే..!.
Health Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2022 | 8:24 PM

Health Tips: ఊపిరితిత్తులలో అనేక రకాల సమస్యలు వస్తాయి. వీటిలో ఆస్తమా వ్యాధి కూడా ఒకటి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. లంగ్ ఇండియా జర్నల్ ప్రకారం.. భారతదేశంలో 30 మిలియన్లకు పైగా ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా మరణించిన వారిలో 42 శాతం భారత్‌కు చెందినవారే. అయినప్పటికీ ప్రజలు ఆస్తమాను తేలికగా తీసుకుంటారు. సరైన చికిత్స తీసుకోరు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఆస్తమా రోగుల సమస్య మరింత పెరగవచ్చు. ఈ నేపథ్యంలో రోగి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా తగ్గడానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? వైద్యులు ఏం చెబుతున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఢిల్లీలోని మూల్‌చంద్ హాస్పిటల్‌లో పల్మనరీ విభాగానికి చెందిన డాక్టర్ భగవాన్ మంత్రి మాట్లాడుతూ.. “ఆస్తమా అనేది తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి. దీనివల్ల శ్వాసనాళాలు ఉబ్బుతాయి. శ్వాసకోశ సంకోచం అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. నిద్రపోతున్నప్పుడు ఈలల శబ్దం, ఛాతీలో బిగుతుగా ఉంటుంది. అలర్జీ వల్ల ఆస్తమా వస్తుంది. వాతావరణంలో మార్పులు, దుమ్ము, పొగ, కాలుష్యం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఆస్తమా, సిఓపిడి రోగుల సంఖ్య పెరుగుతుంది. వాతావరణంలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం. ఇప్పటికే ఏదైనా అలర్జీ, ఆస్తమా సమస్య ఉన్న వారికి సీజన్ మారుతున్న కొద్దీ ఇబ్బందులు మొదలవుతాయని డాక్టర్ మంత్రి తెలిపారు. ఈ సీజన్‌లో పెరిగిన తేమ కారణంగా ఇది జరుగుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తుమ్ములు వస్తాయి.

డాక్టర్‌ని సంప్రదించకుండా ఇన్‌హేలర్‌ను స్టాప్ చేయొద్దు.. చాలా మంది ఆస్తమా రోగులు డాక్టర్ సలహా లేకుండా ఇన్‌హేలర్‌ను ఉపయోగించడం మానేస్తుంటారు. అయితే ఇలా చేయకూడదని డాక్టర్ భగవాన్ చెబుతున్నారు. ఎందుకంటే ఆస్తమా దీర్ఘకాలిక వ్యాధి. ఈ నేపథ్యంలో రోగికి స్థిరమైన ఫాలో-అప్ అవసరం. అయితే, కొన్నిసార్లు రోగి పరిస్థితి కొద్దిగా మెరుగుపడితే.. వారు మెడిసిన్స్‌ని కంటిన్యూ చేయరు. ఇన్హేలర్‌ను ఉపయోగించడం మానేస్తారు. మెడిసిన్స్ సమయానికి తీసుకోరు. అయితే, ఇలా చేయడం ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు.

డాక్టర్ మంత్రి ప్రకారం.. ప్రతి రోగి వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఇన్హేలర్‌ను ఉపయోగించాలని సూచించారు. పల్మనరీ ఫంక్షన్ పరీక్ష చేయించుకుని, రోగికి ఇన్హేలర్‌ను ఎంతకాలం వాడాలో, చికిత్సకు ఎప్పుడు రావాలో సూచిస్తారు వైద్యులు. అయితే, చాలామంది రోగులు వైద్యులను సంప్రదించకుండానే.. ఇన్హేలర్‌ను వదిలేస్తారు. ఇది వారి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వైద్యులతో టచ్‌లో ఉండాలి.. ఆస్తమా రోగులు నిరంతరం వైద్యులతో కాంటాక్ట్‌లో ఉండాలి. స్వంత ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు. ఎందుకంటే.. ఆస్తమా ఒక వ్యాధి. దీని చికిత్స చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆరోగ్యంగా కోలుకునే వరకు మెడిసిన్ కోర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వైద్యుల సలహా ప్రకారం ఇన్హేలర్‌ను వాడుతూ ఉండాలి.

బ్రాంకైటిస్ రోగులు కూడా.. సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. గత వారం రోజులుగా జ్వరం, ఎలర్జీతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. తుమ్ములు, తేలికపాటి దగ్గు, జ్వరం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. వీరిలో కొందరికి కోవిడ్ పరీక్షలు చేయించాల్సి వస్తోంది. కొంతమంది రోగులలో శ్వాస ఆడకపోవడం సమస్య కూడా తలెత్తుతోంది. అలాంటి రోగుల చెస్ట్ CT స్కాన్ చేయగా.. ఇందులో కొంత మంది రోగుల్లో బ్రోన్కైటిస్ సమస్య ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కొంతమంది రోగులలో ఆస్తమా లక్షణాలు కూడా ఉన్నాయి. ఆస్తమా రోగులు వైద్యులు రాసిచ్చిన మందుల కోర్సును పూర్తి చేయాలి. లేదంటే.. ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఆస్తమా.. మరణానికి కూడా కారణం అవుతుంది.

ఆస్తమా రోగులు ఇలా కాపాడుకోవాలి.. 1. ఆస్తమా రోగులు వర్షం, దుమ్ము నుండి దూరంగా ఉండాలి 2. అధిక తేమ ఉన్న పరిసరాలకు దూరంగా ఉండాలి. 3. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. 4. ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఆహారంలో తగినత మొత్తంలో ప్రోటీన్ చేర్చాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..