Bad Habits: ఈ అలవాట్లతో అకాల వృద్ధాప్య సమస్యలు.. వెంటనే వదిలించుకోవాల్సిందే..
Bad Habits for Eating: మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని చెడు అలవాట్ల కారణంగా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చర్మం కూడా నిస్తేజంగా కనిపించడం ప్రారంభమవుతుంది.
Bad Habits for Eating: మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని చెడు అలవాట్ల కారణంగా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చర్మం కూడా నిస్తేజంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖంపై ముడతలు కూడా ఏర్పడుతాయి. వెంట్రుకలు కూడా నిగారింపు కోల్పోతాయి. ఫలితంగా తన వయస్సు కంటే చాలా పెద్ద వయస్కులుగా కనిపిస్తుంటారు. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కచ్చితంగా కొన్ని చెడు అలవాట్లను వదిలించుకోవాల్సిందే. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
అధిక ఉప్పుతో ముప్పే..
ఆహార పదార్థాల్లో రుచి కోసం చాలామంది మోతాదుకు మించి ఉప్పు వాడుతుంటారు. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లినట్లే. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చర్మం కూడా నిస్తేజంగా కనిపిస్తుంది.
చక్కెర
అధిక చక్కెరతో అకాల వృద్ధాప్యంతో పాటు పలు అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. వాస్తవానికి కొల్లాజెన్ , ఎలాస్టిన్ అనే రెండు ప్రోటీన్లు చర్మం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు మెరిసేలా చేస్తాయి. అయితే ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల, ఈ రెండు ప్రొటీన్లు బలహీనపడతాయి. ఫలితంగా చర్మం నిగారింపు కోల్పోతోంది. ముఖంపై ముడతలు కూడా ఏర్పడుతాయి. మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వెంటాడుతాయి.
మద్యపానం
మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్య సమస్యలు వస్తాయి. అలాగే పలు వ్యాధులు చుట్టుముడతాయి. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. అంతే కాకుండా ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ తదితర సమస్యలు వెంటాడుతాయి.
ధూమపానం
పొగతాగేవారి ముఖంపై త్వరగా ముడతలు ఏర్పడుతాయి. వాస్తవానికి ధూమపానం సమయంలో విడుదలయ్యే పొగ ఫ్రీ రాడికల్స్‌కు కారణమవుతుంది. దీని కారణంగా కొల్లాజెన్ స్థాయులు తగ్గిపోతాయి. ఇది చర్మం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇక ధూమపానం ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది.
నీరు తాగకపోతే..
తక్కువ నీరు తాగే వారికి డీహైడ్రేషన్ సమస్యలు రావచ్చు. డీహైడ్రేషన్ కారణంగా శరీరంలోని విషపదార్థాలు బయటకు విసర్జితం కావు. ఫలితంగా చాలా చిన్న వయసులోనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే చర్మం నిగారింపు కోల్పోయి అకాల వృద్ధాప్యంతో కనిపిస్తారు.
నిద్ర లేమి
నిద్ర సరిగ్గా లేకపోయినా వృద్ధాప్య సమస్యలు వెంటాడుతాయి. నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా దాని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. దీని వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ముఖంపై ముడతలు రావడం ప్రారంభిస్తాయి. కాబట్టి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి