Telangana: పంప్‌ హౌస్‌లు ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న తెలివి కూడా లేదు.. విపక్ష నేతలపై మంత్రి ఫైర్..

Telangana: ప్రకృతి విపత్తుపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Telangana: పంప్‌ హౌస్‌లు ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న తెలివి కూడా లేదు.. విపక్ష నేతలపై మంత్రి ఫైర్..
Niranjan Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 16, 2022 | 7:37 PM

Telangana: ప్రకృతి విపత్తుపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. వరదలపై విపక్షాలది బురద రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద బాధితులకు సహాయం అందిస్తున్నారని అన్నారు. విపక్ష నేతలు మాత్రం పార్టీ ఆఫీసుల్లో, మీడియా ముందు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గోదావరికి 500 ఏళ్ల తర్వాత భారీ వరదలు వచ్చాయని అన్నారు. కాళేశ్వరం పంప్ హౌజ్‌ల నీటి మునకపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పంప్‌ హౌస్‌లు అనేవి ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న కనీస ఇంగిత జ్ఞానం కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేదని విమర్శించారు. ఎంతసేపు ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప వారికి మరో ఆలోచనే లేదని దుయ్యబట్టారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ వరద సాయం ఏది? గుజరాత్‌కు తప్ప కేంద్రం తెలంగాణకు సాయం చేయదా? అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు మాట వరసకైనా తెలంగాణకు వరద సాయం ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగరు? అని నిలదీశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు, తెలంగాణకు నిధుల కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా, తెలంగాణకు వర్శిటీలు, మెడికల్ కళాశాలల కేటాయింపు, తెలంగాణ ప్రభుత్వ రుణాల సేకరణ వంటి ప్రతి విషయంలోనూ కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదకని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం అడ్డంకులను అధిగమించి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ పథకాలను సజావుగా కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్షకు ప్రజలు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 47 లక్షల ఎకరాలకు రైతుబంధును అందజేశామన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. 64.95 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7372.56 కోట్లు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతుబంధు నిధుల పంపిణీ త్వరలో పూర్తికానుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..