మందులు అక్కర్లేదు.. రోజూ ఓ యాపిల్ తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ హాంఫట్!
23 February 2026
TV9 Telugu
TV9 Telugu
ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది
TV9 Telugu
ఈ పండ్లను చాలా మంది రెగ్యులర్‌గా తినరు. కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా ఒంట్లో బాగాలేనప్పుడు అన్నం తినాలనిపించకపోతే యాపిల్ పండ్లను తింటుంటారు
TV9 Telugu
వాస్తవానికి యాపిల్ పండ్లవలం అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇతర సమయాల్లోనూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒక యాపిల్ పండును తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది
TV9 Telugu
యాపిల్స్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది
TV9 Telugu
యాపిల్స్‌లో తక్కువ మొత్తంలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కంటి చూపు, ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యాపిల్ తీసుకోవడం వల్ల శరీరానికి తేలికపాటి పోషకాలు లభిస్తాయి
TV9 Telugu
అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే కళ్లలో శుక్లాలు సమస్య రాకుండా చూసుకోవచ్చు. యాపిల్ పండును రోజుకు ఒకటి తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి
TV9 Telugu
ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది
TV9 Telugu
వీటితో యాపిల్లలో విటమిన్ కె, బి6, థయామిన్, రిబోఫ్లేవిన్‌లు స్వల్పంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను మెరుగుపరుస్తాయి. శక్తి ఉత్పత్తికి సహాయపడతాయి. యాపిల్స్‌లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి