AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenali: వంశీ మాయలోడు అనుకోలేదు.. రెండో పెళ్లైనా ఏం పర్లేదులే అనుకుంది.. కట్ చేస్తే..

పెళ్లి పేరుతో పరిచయం… ప్రేమ మాటలతో నమ్మకం… చివరకు రూ.12 లక్షల మోసం. తెనాలి త్రీ టౌన్ పరిధిలో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తి, వివాహం చేస్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది.

Tenali: వంశీ మాయలోడు అనుకోలేదు.. రెండో పెళ్లైనా ఏం పర్లేదులే అనుకుంది.. కట్ చేస్తే..
Vamsi
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 1:32 PM

Share

పెళ్లి సంబంధాలను సమకూర్చే సంస్థలు, మ్యారేజ్ బ్యూరోలు బోలెడు తయారయ్యాయి. ఈ బ్యూరోల ద్వారా సంబంధాలు వెతుక్కునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అడ్డంగా బుక్కయిపోతారు. ఇలాంటి ఘటన తెనాలి త్రీ టౌన్ పరిధిలో జరిగిన సంఘటన కలకలం రేపింది. పట్టణంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళకు, కొల్లిపర మండలం కొత్తూరు లంకకు చెందిన ఆరవపల్లి వంశీ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం అయ్యాడు. వంశీ తనకు గతం వివాహం అయ్యి.. విడాకులు కూడా అయ్యాయని, తిరిగి వివాహం చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నానని నమ్మబలికాడు.

అంతేకాదు ఆ మహిళ పనిచేస్తున్న కంపెనీకి వెళ్లి కలవడం.. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దీంతో వారు వంశీ మాటలను నమ్మారు. ఇదే అదునుగా భావించిన వంశీ టిప్పర్ కొనుగోలు చేయాలని.. డబ్బు అవసరమని చెప్పి, సదరు మహిళ నుంచి వివిధ మార్గాల్లో లోన్స్ తీసుకునేలా ప్రేరేపించాడు. అలా ఆమె వద్ద నుంచి 12 లక్షల 20 వేల రూపాయలు తీసుకున్నాడు. వివాహం చేసుకుంటానని చెప్పి.. చనువుగా ఉండటంతో ఆమె కాబోయే భర్తే కదా అనుకుంది. ఈ క్రమంలోనే వంశీ మరికొంత డబ్బు కావాలని ఒత్తిడి చేశాడు. డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ఆమెపై దాడి చేసి అసభ్యకర పదజాలంతో దూషించి, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. అంతేకాకుండా నీ వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేస్తానని, చంపుతానని బెదిరించినట్లు మహిళా ఫిర్యాదు చేసింది.

బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టుకు హాజరు పరిచినట్లు సిఐ సాంబశివరావు తెలిపారు. వంశీపై తెనాలిలో ఒక కేసు ఉందని, ఇవి కాక మరి కొంతమంది మహిళలు మోసపోయినట్లుగా సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌ల ద్వారా తెలిసినట్లు సిఐ చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి వంశీపై చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: పంటి నొప్పి 10 నిమిషాల్లో తగ్గాలంటే ఈ ఆకు తింటే చాలు..!

Follow Us
బాలయ్య, చిరంజీవి మధ్య ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు
బాలయ్య, చిరంజీవి మధ్య ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ 2026 ఫీజు చెల్లింపులు.. టైం టేబుల్
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ 2026 ఫీజు చెల్లింపులు.. టైం టేబుల్
ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ..ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్
ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ..ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్
వదంతుల సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు..!
వదంతుల సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు..!
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?