AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మీ ఆపరేషన్‌లో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతం.. అట్టుడుకుతున్న మెక్సికో.. !

మెక్సికన్ భద్రతా దళాల ఆపరేషన్‌లో మాదకద్రవ్య వ్యాపారి "ఎల్ మెంచో" హతమయ్యాడు. అతని మరణం దేశవ్యాప్తంగా హింసకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో సైన్యం వీధుల్లోకి రావాల్సి వచ్చింది. అంతేకాకుండా, అనేక దహన సంఘటనలు కూడా జరిగాయి. ఇదిలావుంటే, మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పార్డో శాంతిని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆర్మీ ఆపరేషన్‌లో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతం.. అట్టుడుకుతున్న మెక్సికో.. !
Mexico Violence
Balaraju Goud
|

Updated on: Feb 23, 2026 | 1:05 PM

Share

మెక్సికన్ భద్రతా దళాల ఆపరేషన్‌లో మాదకద్రవ్య వ్యాపారి “ఎల్ మెంచో” హతమయ్యాడు. అతని మరణం దేశవ్యాప్తంగా హింసకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో సైన్యం వీధుల్లోకి రావాల్సి వచ్చింది. అంతేకాకుండా, అనేక దహన సంఘటనలు కూడా జరిగాయి. ఇదిలావుంటే, మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పార్డో శాంతిని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం (ఫిబ్రవరి 22) జరిగిన ఆర్మీ ఫోర్స్ ఆపరేషన్‌లో మెక్సికో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు, జాలిస్కో న్యూ జనరేషన్ (CJNG) డ్రగ్ ముఠా నాయకుడు మరణించాడని స్థానిక మీడియా తెలిపింది. ‘ఎల్ మెంచో’ అనే నెమెసియో ఒసేగురా సెర్వంటెస్ ఆదివారం ఉదయం మధ్య-పశ్చిమ రాష్ట్రమైన జాలిస్కోలో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. నిరసనలతో మెక్సికోను హోరెత్తించారు.

ఎల్ మెంచో మరణం తరువాత, మెక్సికోలోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగింది, స్థానిక భవనాలకు నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం, పోలీసులతో కలిసి వీధుల్లోకి వచ్చి రోడ్లను దిగ్బంధించింది. మెక్సికో అల్లర్లుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఆకాశంలోకి పొగలు ఎగసిపడుతున్నట్లు చూపిస్తున్నాయి.

మెక్సికోలో పరిస్థితి మరింత దిగజారుతున్న నేపథ్యంలో, నివాసితులు ఇళ్లలోనే ఉండాలని ఆదేశ ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా అనేక ప్రాంతాల్లో ప్రజా రవాణా పూర్తిగా నిలిపివేశారు. అయితే, దేశంలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితి సాధారణంగానే ఉందని మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పార్డో పేర్కొన్నారు. శాంతిని కాపాడుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సైనిక చర్య తర్వాత ఎల్ మెంచోను విమానంలో తరలించే సమయంలో గాయాల కారణంగా మరణించారని మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. CJNG తన అసలు ప్రభావ ప్రాంతం జాలిస్కో రాష్ట్రంలో నుండి విస్తరించి మెక్సికో అంతటా దాదాపు దేశవ్యాప్తంగా తన ఉనికిని ఏర్పరచుకుంది. ఎల్ మెంచోను పట్టుకోవడానికి దారితీసిన సమాచారం కోసం యునైటెడ్ స్టేట్స్ 15 మిలియన్ డాలర్లు బహుమతిని ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us