దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం.. వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్‌

ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి భయం నుండి బయటపడుతున్నారు. భారత్‌లోనూ కరోనా కలవరం నుంచి ప్రజలు కాస్త ఊరట పొందినట్టుగానే అనుకున్నాం..కానీ, అంతలోనే దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం సృష్టిస్తోంది.

దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం.. వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్‌
Japanese Encephalitis
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 16, 2022 | 2:32 PM

ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి భయం నుండి బయటపడుతున్నారు. భారత్‌లోనూ కరోనా కలవరం నుంచి ప్రజలు కాస్త ఊరట పొందినట్టుగానే అనుకున్నాం..కానీ, అంతలోనే దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం సృష్టిస్తోంది. అసోంలో జ‌ప‌నీస్ ఎన్‌సెఫ‌లిటిస్(బ్రెయిన్ ఫీవ‌ర్) వైర‌స్ వ‌ణికిస్తుండగా.. పశ్చిమబెంగాల్ లో బ్లాక్ ఫీవర్ కలకలం రేపుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 16 కొత్త కేసులు నమోదు కాగా మోరిగావ్, న‌ల్‌బ‌రి జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున మ‌ర‌ణించారు. అసోంను జ‌ప‌నీస్ ఎన్‌సెఫ‌లిటిస్(బ్రెయిన్ ఫీవ‌ర్) వైర‌స్ వ‌ణికిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 23 మంది చ‌నిపోయారు. మొన్న‌టి వ‌ర‌కు వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన మొరిగావ్, న‌ల్‌బ‌రి జిల్లాల్లో ఈ వైర‌స్ విజృంభిస్తోంది. అసోంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 23 మంది ఈ వైరస్ తో చ‌నిపోయారు. ఈ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

మరోవైపు, పశ్చిమబెంగాల్ లోని 11 జిల్లాలో మొత్తం 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు వెలుగు చూశాయి. ప్రధానంగా డార్జిలింగ్, మాల్డా, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, కలింపోంగ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి. ఎక్కువ రోజుల పాటు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఉండి వచ్చిన వారిలోనే జ్వరం బయటపడుతోందని ఓ అధికారి తెలిపారు. అలాగే బంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ్యక్తుల్లోనూ ఈ లక్షణాలు ఉన్నాయన్నారు. అయితే తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలా అజార్ తో ఎవరు ప్రయివేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినా తాము పూర్తిగా భరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కేసుల్లో న‌గావ్ జిల్లాలో మూడు, న‌ల్‌బ‌రి, ఉద‌ల్‌గురిలో 3 చొప్పున‌, శివ‌సాగ‌ర్‌లో రెండు, బార్‌పేట‌, కామ‌రూప్‌, క‌ర్బీ, హోజాయి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున న‌మోదు అయ్యాయి. ఈ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి