Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi Ka Amrit Mahotsav: బిటిష్ పాలకులకు ధీటుగా.. సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విప్లవ వీరుడు చిత్తూ పాండే గురించి తెలుసా..

దేశం కోసం పోరాడిన ఎందరో వీరులు చరిత్ర మాటున దాగి ఉన్నారు.. అలాంటి వీరుల త్యాగాలను భావితరాలకు అందించడానికి టీవీ9 ప్రయత్నిస్తోంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుడు.. స్వాతంత్య్రం రావడానికి ఒక సంవత్సరం ముందు 1946లో ఈ లోకాన్ని విడిచిపెట్టిన చిత్తు పాండే గురించి ఈరోజు తెలుసుకుందాం..

Azadi Ka Amrit Mahotsav: బిటిష్ పాలకులకు ధీటుగా.. సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విప్లవ వీరుడు చిత్తూ పాండే గురించి తెలుసా..
Freedom Fighter Chittu Pand
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Jul 27, 2022 | 2:55 PM

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్ పాలకుల దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం.. ఎందరో వీరులు తమ జీవితాన్ని త్యాగం చేశారు. మహాత్మా గాంధీ ఆగష్టు 1942లో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతమైంది.. దీంతో బ్రిటిష్ సైనికులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను అరెస్టు చేశారు. బ్రిటిష్ వారి చర్యకు వ్యతిరేకంగా బల్లియా జిల్లాలో ఉద్యమం మొదలు పెట్టారు. ఈ పోరాటంలో చిత్తు పాండే ప్రధాన పాత్ర పోషించారు. దీంతో చిత్తు పాండే హీరో అయ్యాడు.. ‘లయన్ ఆఫ్ బల్లియా’ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుడు.. స్వాతంత్య్రం రావడానికి ఒక సంవత్సరం ముందు 1946లో చిత్తు పాండే ఈ లోకాన్ని విడిచిపెట్టారు.

చిత్తు పాండే 1865లో జననం: చిత్తు పాండే జీ 1865లో బల్లియాలోని రతుచక్ గ్రామంలో జన్మించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బ్రిటీష్ పాలకులకు   వ్యతిరేకంగా పోరాటం చేసేలా ప్రజలకు అవగాహన కల్పించడంలో తన జీవితమంతా గడిపారు.

వారణాసిలో మొదలైన ఆజాద్ రైలు  ఆగష్టు 19న బల్లియాలో సమాంతర ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన వ్యూహం తయారు చేయబడింది. ముందుగా 4 ఆగస్టు 1942న వారణాసి రైలు ఇందుకు వేదికగా మారింది. ఎక్కువగా విద్యార్థులు , యువకులు, ఈ రైలుకు ఆజాద్ అని పేరు పెట్టారు. బల్లియాకు చేరుకున్న తర్వాత విద్యార్థులు స్వాతంత్య్రం తమ జన్మ హక్కు అంటూ వీధుల్లోకి వచ్చారు.

ఇవి కూడా చదవండి

1942 ఆగస్టు 9న ప్రారంభమైన బ్రిటిష్ క్విట్ ఇండియా ఉద్యమానికి విప్లవకారులు ప్రధాన పాత్ర పోషించారు. చిత్తూ పాండే సహచరులు జగన్నాథ్ సింగ్ , పరమాత్మానంద సింగ్‌లతో పాటు అరెస్టు చేయబడ్డారు. దీంతో బల్లియా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే రోజున మహాత్మా గాంధీ, . నెహ్రూతో పాటు ఇతర కాంగ్రెస్ సభ్యులను కూడా బ్రిటిష్ వారు బంధించారు. దేశ వ్యాప్తంగా నిరసనలు పర్వం అధికమైంది.

ప్రజల్లో తిరుగుబాటు: బిటిష్ పాలకులు ఉద్యమకారులతో సంప్రదింపులు జరగడానికి ముందే ప్రజలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బల్లియా  ప్రజలు తిరుగుబాటు ప్రకటించారు. ఆగస్టు 18 నాటికి జిల్లాలోని తహసీల్దార్ ఆఫీసును స్వాధీనం చేసుకోవాలని.. ఆగస్టు 19 న బల్లియాపై పూర్తి శక్తితో దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.

అమరులైన 19 మంది విప్లవకారులు బల్లియా జిల్లా ప్రజలు బ్రిటిష్ పాలకులపై పూర్తి స్థాయిలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిచోటా నిరసనలు జరిగాయి, పోలీస్ స్టేషన్ ను తగలబెట్టారు. విప్లవకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది విప్లవకారులు అమరులయ్యారు. అయినప్పటికీ తిరుబాటు ఉద్యమం ఆగలేదు. ఆందోళన కొనసాగించారు. పోలీసుల వద్ద ఉన్న మందుగుండు అయిపోయిన తర్వాత పోలీసులు ఉద్యమకారులకు లొంగిపోయారు.

జైలు బయట జనం: చిత్తూ పాండేను ఖైదు చేసిన బల్లియాలోని జైలు వెలుపల వేలాది మంది చేరుకున్నారు. దీంతో కలెక్టర్ చిత్తు పాండేతో సహా 150 మంది విప్లవకారులను విడిచిపెట్టాడు. అప్పుడు జిల్లాలో బ్రిటిష్ పాలకులకు.. సమాంతర ప్రభుత్వం ఏర్పడింది.

ప్రజల విరాళాలు: సమాంతర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం హనుమాన్ గంజ్ కోఠిలో నిర్మించారు. అందుకోసం ప్రజలు విరాళాలు ఇచ్చారు. చిత్తు పాండే కూడా ప్రభుత్వాన్ని నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

తిరుగుబాటు దారులను మోసం చేసిన ప్రభుత్వం: తిరుగుబాటు దారులతో కలెక్టర్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఆగస్టు 22 న, బ్రిటిష్ అధికారి నీర్ సోల్…  బల్లియాకు చేరుకొని..  మిస్టర్ వాకర్‌ను జిల్లాకు కొత్త కలెక్టర్‌గా నియమించాడు. అనంతరం.. ఆగస్టు 23న భారీగా పోలీసు దళాలు వచ్చాయి.. జిల్లాలోని తిరుగుబాటు దారులపై విచక్షణా రహితంగా దాడులు చేశారు. విప్లవకారులను హింసించారు. చిత్తు పాండేని పట్టుకోవడానికి బ్రిటిష్ అధికారులు కూడా బల్లియా కు చేరుకున్నారు. కానీ సక్సెస్ కాలేదు.. అయితే  ఏ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాడో ఆ దేశం దాస్య విముక్తి అయ్యే సమయానికి చిత్తూ పాండే లేరు..  1946లో ఆయన మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..