Viral Video: వరద నీటితో ఉప్పొంగుతున్న నది.. బ్రిడ్జి మీద నుంచి చూస్తూ.. హఠాత్తుగా నదిలోకి దూకిన యువకుడు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి పొంగిపొర్లుతున్న గిర్నా నదిలోకి దూకాడు. ఆ యువకుడు ఇంకా ఆచూకీ లభించలేదు.

Viral Video: వరద నీటితో ఉప్పొంగుతున్న నది.. బ్రిడ్జి మీద నుంచి చూస్తూ.. హఠాత్తుగా నదిలోకి దూకిన యువకుడు..
Man Dive Floods Viral Video
Follow us

|

Updated on: Jul 15, 2022 | 3:45 PM

Viral Video: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, ప్రాజెక్టులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. వేలాది గ్రామాలు నీట మునిగాయి. అయితే ప్రాజెక్టుల వద్దకు భారీగా వరద నీరు చేరుతుండడంతో.. కొంతమంది చూడ్డానికి వెళ్తున్నారు.. అనుకోని ప్రమాదాలు ఏర్పడి.. ప్రాణాలు పోగొట్టుకునేవారు కొందరు అయితే.. మరికొందరు.. ప్రమాదపు అంచువరకూ వెళ్లివస్తున్నారు. కొందరు తమకు ఈత వచ్చు అంటూ అత్యుత్సాహం ప్రదర్శించి కోరి ఆపదను కొని తెచ్చుకుని.. తమ కుటుంబ సభ్యులకు తీరని వ్యధను మిగులుస్తున్నారు.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ  వీడియోలో పొంగిపొర్లుతున్న నదిలో దూకి మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని మాలెగావ్‌లో గురువారం చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పొంగిపొర్లుతున్న గిర్నా నదిలోకి దూకాడు. 23 ఏళ్ల యువకుడు ఇంకా ఆచూకీ లభించలేదు.  అనే వ్యక్తి కోసం అధికారులు గురువారం రాత్రి వరకు వెతికినా ఆచూకీ లభించలేదు.

ఇవి కూడా చదవండి

మాలేగావ్ లో ఉన్న గిర్నా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. స్థానికుడు 23 ఏళ్ల నయీమ్ అమీన్ అనే యువకుడు అందరూ చూస్తుండగానే.. నదిలోకి ఒక్కసారిగా దూకాడు. బ్రిడ్జ్ మీద ఉన్న వారు.. ఎంత సేపు చూసిన ఆ యువకుడు తిరిగి ఒడ్డుకు చేరుకోలేదు. సమాచారం అందుకున్న అధికారులు యువకుడి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు నయీమ్ ను గురువారం రాత్రి వెదికారు.. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే నయీమ్అ ఆత్మహత్య చేసుకోవడానికి నదిలో దూకాడా లేక ఈత కొడదామని దూకి గల్లంతయ్యాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.

మరోవైపు రాష్ట్రలోని పలు జిల్లాల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణె, నాసిక్‌తో పాటు మరో 3 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. పాల్ఘర్ జిల్లా వసాయ్ నగరంలో నిన్న కొండచరియలు విరిగిపడి ఒక వ్యక్తి , అతని కుమార్తె మరణించారు. అంతేకాకుండా, గోండియా జిల్లాలో నలుగురు వ్యక్తులు వరద నీటిలో కొట్టుకుపోయారు. భారీగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అనేక హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..