AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: బీ అలర్ట్.. దేశంలోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే

దేశంలో మంకీపాక్స్ (Monkeypox) కేసు వెలుగుచూడడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఆరోగ్యశాఖ విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకూ పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే వారు.. అక్కడ....

Monkeypox: బీ అలర్ట్.. దేశంలోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే
Monkeypox
Ganesh Mudavath
|

Updated on: Jul 15, 2022 | 3:50 PM

Share

దేశంలో మంకీపాక్స్ (Monkeypox) కేసు వెలుగుచూడడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఆరోగ్యశాఖ విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకూ పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే వారు.. అక్కడ అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని కోరింది. విదేశాలకు వెళ్లేవారు.. చర్మ సంబంధ వ్యాధులు, జననేంద్రియ వ్యాధులతో బాధపడుతోన్న వారికి దూరంగా ఉండాలి. చనిపోయిన లేదా బతికున్న జంతువులను నేరుగాతాకకూడదు. రోగులు ఉపయోగించిన దుస్తులు, పడక, ఇతర వస్తువులను వినియోగించకూడదని సూచనలు చేసింది. అంతే కాకుండా స్థానికంగా మంకీపాక్స్‌ కేసులు నమోదైనా, అలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారితో సన్నిహితంగా ఉన్నా సమీపంలోని హెల్త్ సెంటర్ కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కోరింది. మంకీపాక్స్‌ వైరస్ కేసులను నిర్ధారించేందుకు 15 వైరస్‌ రీసర్చ్‌ అండ్‌ డయాగ్నోటిక్‌ లాబొరేటరీస్‌ సిద్ధంగా ఉన్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

కాగా.. మానవాళికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్ వైరస్ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ అయింది. బాధిత వ్యక్తి విదేశాల్లో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ తెలిపారు. స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది జంతువుల నుంచి మానవులకు సోకుతుంది. తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తితో చనువుగా ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఈ వ్యాధి ఇతరులకు సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూఏఈలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఓ మంకీపాక్స్‌ రోగితో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. బాధితుడి తల్లిదండ్రులు సహా మొత్తం 13 మందిని ‘ప్రైమరీ కాంటాక్ట్స్‌’గా గుర్తించారు.

ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాపు, నడుమునొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలతో పాటు ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. వ్యాధికి గురైన వారిలో చాలా వరకు వారాల్లోనే కోలుకుంటారు. కొందిరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌