AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవాల్సి వస్తోంది.. సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ చురకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోతుల మధ్య రోడ్డును వెదుక్కోవల్సిన పరిస్థితి వస్తోందని మండిపడ్డారు. రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయని విమర్శించారు. రోడ్ల అభివృద్ధి,...

Andhra Pradesh: గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవాల్సి వస్తోంది.. సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ చురకలు
Pawan Kalyan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 14, 2022 | 6:09 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోతుల మధ్య రోడ్డును వెదుక్కోవల్సిన పరిస్థితి వస్తోందని మండిపడ్డారు. రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయని విమర్శించారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేయాలనే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆక్షేపించారు. వారి బాధ్యత గుర్తు చేయాలనే ఉద్దేశ్యంతో #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్ తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోందని వెల్లడించారు. జులై15 నాటికి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసి, ప్రతిపక్షాల నోరు మూయిస్తామన్న సీఎం జగన్.. ఆ ఛాలెంజ్ ను స్వీకరించి రోడ్లను బాగు చేయాలని సూచించారు. ఆర్ అండ్ బీ పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కి.మీ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కి.మీ, ఇతర రోడ్లు 6,100 కి.మీ ఉన్నాయి. ముఖ్యంగా 9,222 కి.మీ పంచాయతీ రోడ్లకు మరమ్మతుల కోసం రూ.1,072 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ఏప్రిల్ లో ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉంది. రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏటా కనీసం 8 వేల కి.మీ రోడ్లు మెయింటినెన్స్, మరమ్మతుల పనులు చేయాలి. ఇందుకోసం దాదాపు రూ.1500 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇది కాకుండా పీరియాడికల్ మెయింటినెన్స్, రిపేర్లు చేయాలి. ఇందుకోసం మరో రూ.500 కోట్లు అదనంగా అవసరం ఉంటుంది. ఈ మూడేళ్లలో మెయింటినెన్స్, మరమ్మతు పనులు చేయకపోవడంతో రహదారులు చాలా వరకు దెబ్బతిన్నాయి. 30 వేల కి.మీ మేర రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోలేక గుంతలమయంగా మారింది. మూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో చాలా వరకు కొత్తగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది. మరమ్మతులకే నిధులు లేక రోడ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం.. కొత్త రోడ్లు వేయడం అంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులరీత్యా అసాధ్యమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కనీస మరమ్మతులు చేసి ప్రయాణానికి అనువుగా మార్చాలి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. రోడ్లు నిర్వహణ కోసం అని పెట్రో సెస్ వసూలు చేస్తున్నారు. ఇది రూ.750 కోట్ల మేర ఏటా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి.

       – పవన్ కల్యాణ్, జనసేన అధినేత

అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తే సరిపోదన్న జనసేనాని.. రోడ్లు అవసరం లేదనే ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.మీ ఊళ్లో, మీ చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోంది అని చెప్పే ఫోటోలు, వీడియోలు తీయండి. వాటిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయండి. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో నేను కూడా పాల్గొంటాను. మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని పవన్ కల్యాణ్ పిలువునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి