GGH Ongole Recruitment 2022: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్! ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌ అర్హతలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH Ongole).. ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన పెర్ఫ్యూషనిస్ట్, ఎమ్మారై టెక్నీషియన్, సీటీ టెక్నీషియన్ తదితర (Perfusionist jobs) పోస్టుల..

GGH Ongole Recruitment 2022: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్! ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌ అర్హతలు..
Andhra Pradesh
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 14, 2022 | 4:22 PM

GGH Ongole Perfusionist Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH Ongole).. ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన పెర్ఫ్యూషనిస్ట్, ఎమ్మారై టెక్నీషియన్, సీటీ టెక్నీషియన్ తదితర (Perfusionist jobs) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 16

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: పెర్ఫ్యూషనిస్ట్, ఎమ్మారై టెక్నీషియన్, సీటీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్‌-2, స్పీచ్ థెరపిస్ట్, పోస్ట్‌మార్టం అటెండెంట్ పోస్టులు.

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి 28,000ల వరకు జీతం చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబందిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
  • ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు: రూ.300

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సూపరింటెండెంట్‌ కార్యాలయం, జీజీహెచ్‌, రూమ్ నెం-214, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.