Monkeypox: ఇండియాలో మంకీపాక్స్ ఎంట్రీ.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో వైరస్ నిర్ధరణ
ఓ వైపు కరోనా భయపెడుతుంటే మరో వైపు మంకీ పాక్స్ (Monkeypox) వైరస్ కలవరపెడుతోంది. మానవాళికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ వైరస్ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు....
ఓ వైపు కరోనా భయపెడుతుంటే మరో వైపు మంకీ పాక్స్ (Monkeypox) వైరస్ కలవరపెడుతోంది. మానవాళికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ వైరస్ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ అయింది. బాధిత వ్యక్తి విదేశాల్లో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది జంతువుల నుంచి మానవులకు సోకుతుంది. తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తితో చనువుగా ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఈ వ్యాధి ఇతరులకు సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాపు, నడుమునొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలతో పాటు ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. వ్యాధికి గురైన వారిలో చాలా వరకు వారాల్లోనే కోలుకుంటారు. కొందిరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వైరస్ కేసులతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మంకీపాక్స్ అనేది కరోనా తరహాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కాదని, మశూచి మాదిరే మంకీపాక్స్ కూడా ఆ కుటుంబానికి చెందినదేనని నిపుణులు అంటున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్ వైరస్ కరోనా అంత ప్రమాదకారి కాదని వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..