Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో శతాబ్ధి రైళ్ల పునరుద్ధరణ
Railway News: కోవిడ్ పాండమిక్ తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. ఇందులో భాగంగా మరో రెండు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.
Railway Passenger Alert: కోవిడ్ పాండమిక్ తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. ఇందులో భాగంగా మరో రెండు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్(Shatabdi Express) రైళ్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. పూణె – సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – పూణె శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును ఆగస్టు 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. రైలు నెం.12025 పూణె – సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రతి రోజూ ఉదయం 06.00 గం.లకు పూణె నుంచి బయలుదేరి మధ్యాహ్నం 02.20 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే రైలు నెం.12026 సికింద్రాబాద్ – పూణె శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 10వ తేదీ నుంచి మధ్యాహ్నం 02.45 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. రాత్రి 11.10 గం.లకు పూణెకి చేరుకుంటుంది.
Restoration of Pune-Secunderabad-Pune Shatabdi express @RailMinIndia pic.twitter.com/wYQq4STPXx
— South Central Railway (@SCRailwayIndia) July 14, 2022
ఈ శతాబ్ధి రైళ్లు షోలాపూర్, కాలబుర్గి, వాడి, తాండూర్, వికారాబాద్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. రెండు మార్గాల్లోనూ వారంలో మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ లేదా నేరుగా రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గర తమ ప్రయాణ టికెట్లను బుకింగ్స్ చేసుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..