Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ బాధ తప్పినట్లే.. కండీషన్స్ అప్లై సుమీ..!
Telangana: తెలంగాణలోని వాహనదారులకు ఇది నిజంగా శుభవార్తనే. వాహనాల ఫిట్‌నెస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణలోని వాహనదారులకు ఇది నిజంగా శుభవార్తనే. వాహనాల ఫిట్‌నెస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవును, వివిధ రకాల పన్నుల చెలింపులతో సతమతమవుతున్న రవాణా వాహనాల డ్రైవర్లకు భారీ ఉపశమనం కలిగించింది. గడువు ముగిసినా ఫిట్‌నెస్ ధ్రువీకరణ చేయించుకోని వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించాలన్న నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ ఇచ్చింది. దీని ప్రకారం.. కరోనా సమయంలో వ్యాలిడిటీ కలిగిన పాత ఫిట్‌నెస్ పత్రాలు చెల్లుబాటు అవనున్నాయి. అంటే.. ఈ ఉత్తర్వులు 2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 అక్టోబరు 31 మధ్య వ్యవధిలో వర్తిస్తాయి.
ఇదిలాఉంటే.. కేంద్రం సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫిట్‌నెస్ ఆలస్యానికి రోజుకు రూ.50 జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనదారుల కాస్త ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. వీరి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని రకాల మోటారు వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల ఆలస్య రుసుమును రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది వాహనదారులకు భారీ ఉపశమనం లభించినట్లయ్యింది. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.650 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోనుంది.