AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Exam Dates 2026: ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ రాత పరీక్షల తేదీలు ఇవే.. మరో 2 రోజుల్లోనే అడ్మిట్ కార్డులు విడుదల

రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి త్వరలో ఆన్‌లైన్ రాత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను తాజాగా భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను పొందుపరిచింది..

RRB Exam Dates 2026: ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ రాత పరీక్షల తేదీలు ఇవే.. మరో 2 రోజుల్లోనే అడ్మిట్ కార్డులు విడుదల
RRB Paramedical Exam Dates
Srilakshmi C
|

Updated on: Mar 06, 2026 | 3:53 PM

Share

హైదరాబాద్‌, మార్చి 6: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి త్వరలో ఆన్‌లైన్ రాత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను తాజాగా భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను పొందుపరిచింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి సిటీ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఇక పరీక్షకు 4 రోజుల ముందు వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచనున్నారు. కాగా ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో మొత్తం 434 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ పరీక్ష సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నేటి నుంచి ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ రాత పరీక్షలు

రైల్వేలో టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టులకు సంబంధించిన ఆన్‌లన్‌ రాత పరీక్షలు మార్చి 6 (శుక్రవారం) నుంచి ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో మార్చి 6, 9, 10, 13 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు మూడు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద రైల్వేలోని వివిధ విభాగాల్లో మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌, టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 పోస్టులను భర్తీ చేయనుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us