Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రాత్రివేళ యువతి ఇంటికెళ్లిన యువకుడు.. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు.. చివరికి ఊహించని షాక్!

ఆ ఇద్దరూ చాలాకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అయితే ఇద్దరి మధ్య గత కొద్దిరోజుల నుంచి..

Viral: రాత్రివేళ యువతి ఇంటికెళ్లిన యువకుడు.. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు.. చివరికి ఊహించని షాక్!
Representative Image 1Image Credit source: Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2022 | 1:28 PM

ఆ ఇద్దరూ చాలాకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అయితే ఇద్దరి మధ్య గత కొద్దిరోజుల నుంచి పలు సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి ప్రేయసి ఇంటికెళ్ళాడు ప్రియుడు. అతడు వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. కొద్దిసేపటి తర్వాత వారి గది నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. ఏం జరిగిందా అని కంగారుపడుతూ అక్కడి చేరుకున్న స్థానికులకు ఊహించని సీన్ ఎదురైంది. అదేంటంటే.?

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని ఫేకారి గ్రామంలో అర్చన అనే యువతి డయల్ 112లో ఉద్యోగం చేస్తోంది. అదే గ్రామానికి చెందిన కమలేశ్‌తో ఆమె గత కొన్నేళ్ళుగా ప్రేమలో మునిగి తేలుతోంది. ఉద్యోగంలో భాగంగా ఇటీవల స్థానికంగా ఉండే పాతబస్తీలోకి మకాం మార్చిన అర్చన ఇంటికి కమలేశ్ తరచూ వస్తుండేవాడు. కొన్నాళ్లు ఇద్దరి మధ్య అంతా సాఫీగానే జరిగింది. అయితే ఇటీవల కమలేశ్.. అర్చనపై అనుమానం పెంచుకున్నాడు. తనకు తెలియకుండా వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భావించాడు. ఇక ఈ విషయంపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లాడు కమలేశ్. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. వారి అరుపులకు చుట్టుప్రక్కల వారు ఏం జరుగుతోందా అని వారింటి వద్దకు వెళ్లారు. ఎంత కొట్టినా తలుపులు తీయకపోయేసరికి.. వాటిని బద్దలు కొట్టారు.

అంతే! ఎదురుగా స్థానికులకు షాకింగ్ సీన్ కనిపించింది. రక్తపు మడుగులో విగత జీవిగా అర్చన పడి ఉండగా.. కమలేశ్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గదిలో దొరికిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొదట అర్చనను సుత్తితో బాది హత్య చేసి.. అనంతరం కమలేశ్ ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…