Viral: కండోమ్ కొనేందుకు షాప్‌కెళ్లిన మహిళ.. అమ్మే వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు దిమ్మతిరిగే షాక్!

ఓ మహిళ తన భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అయితే కంగారులో తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లడం మర్చిపోయింది.

Viral: కండోమ్ కొనేందుకు షాప్‌కెళ్లిన మహిళ.. అమ్మే వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు దిమ్మతిరిగే షాక్!
Representative Image 1Image Credit source: Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2022 | 1:30 PM

ఓ మహిళ తన భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అయితే కంగారులో తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లడం మర్చిపోయింది. ఇక కండోమ్స్ కోసం దగ్గరలోని మెడికల్ స్టోర్‌కు వెళ్లింది. షాప్‌లోని కౌంటర్‌ వద్ద ఉన్న వ్యక్తిని కండోమ్స్ కావాలని అడిగింది. దానికి అక్కడున్న వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఇంతకీ అసలు కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన జెస్సికా అనే మహిళ తన భర్తతో కలిసి విస్కాన్సిన్‌కు వెకేషన్ కోసం వెళ్లింది. తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తెచ్చుకోకపోవడంతో.. దగ్గరలో ఉన్న వాల్‌గ్రీన్స్ స్టోర్‌కు కండోమ్స్ కొనేందుకు వెళ్లింది. అయితే ఆ షాప్‌లో ఉన్న వ్యక్తి జెస్సికాకు కండోమ్స్ అమ్మేందుకు నిరాకరించాడు. ‘మేము కండోమ్స్ మీకు అమ్మవచ్చు. కాని నా మత విశ్వాసం కారణంగా వాటిని అమ్మలేను’ అని అక్కడున్న వ్యక్తి జెస్సికాకు చెప్పాడు. దీనితో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె.. అతడితో గొడవకు దిగింది. అయితే అక్కడ గుమిగూడిన వారిలో ఎక్కువ మంది మగవారు ఉండటంతో జెస్సికా సైలెంట్ అయింది.

ఇక కొద్దిసేపటికి స్టోర్ మేనేజర్.. ఆ గుమస్తాను అక్కడ నుంచి పంపించేస్తాడు. అనంతరం ఆమెకు కండోమ్స్ విక్రయిస్తాడు. ‘తమ కంపెనీ పాలసీ ప్రకారం.. ఉద్యోగులకు అభ్యంతరం అనిపించేవి తిరస్కరించడానికి అనుమతి ఉందని.. మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి’ అని పేర్కొంటాడు. కాగా, తనకు కలిగిన ఈ అనుభవాన్ని జెస్సికా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటుంది.(Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?