Viral Video: కుర్చీలో దాక్కున్న కింగ్ కోబ్రా.. ఎక్కడుందో తెలిస్తే గుండె గుభేల్.. వైరల్ వీడియో!
సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల పాముల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో ఇలాంటి వీడియో మాత్రం..
పాములు అత్యంత ప్రమాదకరమైనవి. అవి ఒక్క కాటేస్తే చాలు.. కాటికి వెళ్ళాల్సిందే. అందుకే చాలామందికి పాములంటే చచ్చేంత భయం. సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల పాముల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో ఇలాంటి వీడియో మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ వీడియో చూస్తే చాలు.. మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
మీరెప్పుడైనా ఊహించారా.? మీరు తరచూ కూర్చునే కుర్చీలో కింగ్ కోబ్రా దాక్కుని ఉంటుందని..! ఏంటి నమ్మలేకపోతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూసేయండి. ఈ మధ్యకాలంలో ఫైబర్ కుర్చీలో మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తున్న సంగతి తెలిసిందే. అందులోని కొన్ని మోడల్స్‌కు వెనుక ఉండే కాళ్లు అచ్చం గొట్టాల మాదిరిగా హ్యలోగా ఉంటాయి. ఎంచక్కా అందులో ఏమైనా కూడా పట్టేంత గ్యాప్ ఉంటుంది. అలాంటి కుర్చీలోని ఒక కాలిలో భారీ కింగ్ కోబ్రా దాగుంది. టార్చ్ వేసి చూస్తేనే గానీ.. అందులో అది ఉన్నట్లు తెలియదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
View this post on Instagram