AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : నీ కొత్త ప్రయాణం చూస్తుంటే సంతోషంగా ఉంది.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్..

తెలుగు సినిమా ప్రపంచంలో మరో హీరో పెళ్లిపీటలెక్కారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 6న వీరిద్దరి వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.

Ram Charan : నీ కొత్త ప్రయాణం చూస్తుంటే సంతోషంగా ఉంది.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్..
Ram Charan Family
Rajitha Chanti
|

Updated on: Mar 07, 2026 | 6:51 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన శిరీష్.. విభిన్న కంటెంట్ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఇప్పుడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేసి తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి పెళ్లి వేడుక మార్చి 6న శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరులో ఘనంగా జరిగింది. ఈ వేడకకు సినీప్రముఖులు, సన్నిహితులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు, వెంకటేశ్, కళ్యాణ్ రామ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జంటకు రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్, నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్ కు అభినందనలు తెలిపారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు. అల్లు శిరీష్, నయనిక జంటతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

ఇదిలా ఉంటే.. అల్లు శిరీష్, నయనిక చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలో నయనికతో శిరీష్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Follow Us
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొందే నిపుణుల చిట్కాలు
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొందే నిపుణుల చిట్కాలు
అల్లు శిరీష్, నయనికల వివాహం.. రామ్ చరణ్ ట్వీట్..
అల్లు శిరీష్, నయనికల వివాహం.. రామ్ చరణ్ ట్వీట్..
పారేయండి..దానం చేయండి..సర్దండి! మనశ్శాంతి పెంచే చిట్కా
పారేయండి..దానం చేయండి..సర్దండి! మనశ్శాంతి పెంచే చిట్కా
పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..
పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు
బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది
బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది
జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్
జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్
పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్
పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్